Share News

kumaram bheem asifabad- ఎస్పీఎంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలి

ABN , Publish Date - May 26 , 2026 | 10:27 PM

ఎస్పీఎంలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాద్యక్షుడు మల్లికార్జున్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్‌ లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఎస్పీఎం పునః ప్రారంభించిన 2018 ఆగస్టు నుంచి మిల్లును టేకోవర్‌ చేసిన జేకే యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు అవాంతరాలు సృష్టిస్తోందన్నారు. మిల్లులో 277 మంది పర్మనెంటు కార్మికులతో కలిపి సుమారు 2,188 మంది పని చేస్తున్నప్పటికీ వారికి ఎలాంటి భద్రత లేదన్నారు. లేబర్‌ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఫలితం లేకపోగా మిల్లు యాజమాన్యం ఎన్నికలు జరుగకుండా కోర్టును ఆశ్రయించిందన్నారు.

kumaram bheem asifabad- ఎస్పీఎంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలి
వినతిపత్రం ఇస్తున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాద్యక్షుడు మల్లికార్జున్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఎస్పీఎంలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాద్యక్షుడు మల్లికార్జున్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్‌ లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఎస్పీఎం పునః ప్రారంభించిన 2018 ఆగస్టు నుంచి మిల్లును టేకోవర్‌ చేసిన జేకే యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు అవాంతరాలు సృష్టిస్తోందన్నారు. మిల్లులో 277 మంది పర్మనెంటు కార్మికులతో కలిపి సుమారు 2,188 మంది పని చేస్తున్నప్పటికీ వారికి ఎలాంటి భద్రత లేదన్నారు. లేబర్‌ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఫలితం లేకపోగా మిల్లు యాజమాన్యం ఎన్నికలు జరుగకుండా కోర్టును ఆశ్రయించిందన్నారు. అన్ని సంఘాలు కూడా ఎన్నికలు జరపాలని కోరుతూ నిరసనలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కోర్టు కేసు ఉపసంహరించుకొని వెంటనే ఎన్నికలు నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వినతి పత్రం అందించిన వారిలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, తదితరులు ఉన్నారు.

ఎన్నికల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి

ఎస్పీఎంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే జరిగేలా ప్రక్రియ ప్రారంభించాలని బీఆర్‌ఎస్‌ అనుబంధ ఎస్పీఎం యూనియన్‌ (ఈ-966) ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు అన్నారు. మంగళవారం స్థానికంగా ఆయన మాట్లాడారు. మిల్లులో రహస్య బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరుగకుండా ఉండేందుకు మిల్లు యాజమాన్యం అనేక అడ్డంకులు కల్పిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లో పాత కార్మిక చట్టాల ద్వారా పనులు జరుగుతుండగా, ఎస్పీఎం జెకె యాజమాన్యం మాత్రం నూతనంగా చేసిన చట్టాల ప్రకారం ముందుకెళుుతుందన్నారు. ఎన్నికల జరిపేందుకు కార్మిక శాఖకు అధికారం లేదని, సీక్రెట్‌ బ్యాలెట్‌లో పోటీచేసేందుకు కార్మిక సంఘాలకు అర్హత లేదని వివిధ రకాల ప్రచారం చేస్తూ ఎన్నికలు జరుగకుండా యాజమాన్యం చేస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రలు, స్థానిక నాయకులు పట్టించుకోని ఎన్నికలు జరిగేలా ఒత్తిడి తేవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు గోగర్ల కన్నయ్య, రాగులయ్య, భూమయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 10:27 PM