Share News

kumaram bheem asifabad- ఎన్నికల హామీలు అమలు చేయాలి

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:17 PM

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పింఛన్ల పెంపు వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం ఎమ్మెల్యే దరఖాస్తుదారులకు పింఛన్‌ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పింఛన్లు అందజేయడం వల్ల ప్రజలకు ఉపయోగకరమని చెప్పారు

kumaram bheem asifabad- ఎన్నికల హామీలు అమలు చేయాలి
జైనూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి. పాల్గొన్న నాయకులు

లింగాపూర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పింఛన్ల పెంపు వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం ఎమ్మెల్యే దరఖాస్తుదారులకు పింఛన్‌ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పింఛన్లు అందజేయడం వల్ల ప్రజలకు ఉపయోగకరమని చెప్పారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ. నాలుగు వేల పింఛన్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. మండలంలో పింఛన్‌ కోసం 251 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇందులో 189 మందికు మంజూ రయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాథ్‌రావు, ఎంపీడీవో సుధీర్‌, సర్పంచులు రాజశేఖర్‌, జ్యోతిరాం,ఉదయ్‌సింగ్‌, కిషన్‌, సులోచనా, సునీత, మండల నాయకులు లక్యానాయక్‌, కిషన్‌, రాహుల్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): దివాంగ్యులు అందరికీ పింఛన్‌ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సిర్పూర్‌(యు) చేయూత పథకంలో పింఛన్‌ కోసం అర్హత ఉన్న మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాథ్‌రావు, ఎంపీడీ వో రవీందర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): చేయూత పింఛన్‌దారులకు రూ. ఆరు వేలు మంజూరు చేయాలని ఆసిఫాబాద్‌ ఎమ్యెల్యే కోవ లక్ష్మి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో ఒంటరి మహిళ, వితంతు, దివ్యాగులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను శనివారం ఆమె పంపీణి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, స్థానిక సర్పంచ్‌ కొడప ప్రకాష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, సహకార చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌ తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌, ఎంపీడీవో క్రిష్ణవేణి, ఎంపీవో శశికుమార్‌. సూపరింటెండెంట్‌ మల్లేష్‌, ఏపీవో నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 10:17 PM