kumaram bheem asifabad- ఎన్నికల ఖర్చులను స్పష్టంగా నమోదు చేయాలి
ABN , Publish Date - Feb 06 , 2026 | 10:26 PM
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో పోటీలో ఉండే అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులతో శుక్రవారం వ్యయ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అభ్యర్థులు తమ ఖర్చులను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో పోటీలో ఉండే అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులతో శుక్రవారం వ్యయ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అభ్యర్థులు తమ ఖర్చులను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. అభ్యర్థులు సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం ముందస్తూ అనుమతి పొందాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియామవాళి ప్రకారం ఖర్చులను నమోదు చేసి వివరాలను నిర్ణీత కాలపరిమితిలో సమర్పించాలని సూచించారు. ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహణ, రికార్డుల సంరక్షణ ఖర్చుల పరిమితిపై సమగ్ర అవగాహన కల్పించామని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఖర్చుల పరిమితిని అధిగమించినట్లాయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో ఎన్నికల వ్యయ నోడల్ అదికారి నదీం, ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్, మాస్టర్ ట్రైనీ ఊశన్న, ఎన్నికల అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో నిర్వహణ ఖర్చులకు సంబంఽధించిన లెక్కలు పక్కాగా చూపాలని ఎన్నికల పరిశీలకుడు దేవేందర్ అన్నారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం బరిలో ఉండే అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచారానికి ఎంత ఖర్చు పెడుతున్నారనే లెక్కలు పక్కాగా ఉండాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులపై అధికారుల నిఘా ఉంటుందన్నారు. ప్రతీ లెక్క చూపాల్సి ఉంటుం దని తెలిపారు. సమావేశంలో బరిలో ఉండే అభ్యర్థులు పాల్గొన్నారు.