Share News

‘టీఆర్‌ఎస్’తో అభ్యంతరం ఉండదు

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:05 AM

తెలంగాణలో ‘టీఆర్‌ఎస్‌’ సంక్షిప్త పదాలతో మరో పార్టీ ఉన్నా తమకు ఎటువంటి అభ్యంతరం ఉండదని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

‘టీఆర్‌ఎస్’తో అభ్యంతరం ఉండదు

  • తెరాస ఉన్నా, తెరాసే ఉన్నా పర్లేదు: ఈసీ వర్గాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ‘టీఆర్‌ఎస్‌’ సంక్షిప్త పదాలతో మరో పార్టీ ఉన్నా తమకు ఎటువంటి అభ్యంతరం ఉండదని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి. టీఆర్‌ఎస్‌ సంక్షిప్త పదం మరో పార్టీ విషయంలోనూ ధ్వనించవచ్చని, అలాగే, తెరాస (తెలంగాణ రాష్ట్ర సమితి) మాదిరిగా కొత్తగా ఏర్పడిన తెరాసే (తెలంగాణ రాష్ట్ర సేన) ధ్వనించినా తాము పట్టించుకోబోమని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. పార్టీ పూర్తి పేర్లే తమకు ముఖ్యమని, వాటి సంక్షిప్త పదాలు తమకు ముఖ్యం కాదని ఎన్నికల కమిషన్‌కు చెందిన మరో అధికారి తెలిపారు. బీఆర్‌ఎస్‌ తమ పార్టీ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చుకోవచ్చునని, దానికి తమ అభ్యంతరం ఉండదని చెప్పారు. సంక్షిప్త పదాలు ఒకే విధంగా ధ్వనించే పార్టీల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉందని, ‘భారతీయ’ అన్న పదం ఉన్న పార్టీలు, ‘జనతా’ అన్న పదం ఉన్న పార్టీలు కూడా ఎన్నో ఉన్నాయని వివరించాయి. అదే విధంగా కాంగ్రెస్‌ అన్న పదం చివరగా ఉన్న పార్టీలు అనేకం ఉన్నాయని ఈ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 26 , 2026 | 05:05 AM