Share News

kumaram bheem asifabad- ఆర్టీసీలో ఎన్నికల నగారా

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:29 PM

ఆర్టీసీలో పదేళ్ల తర్వాత యూనియన్‌ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కార్మికశాఖ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 21న పోటీచేసే సంఘాల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించి, 22న ముసాయిదా ఓటర్ల జాబితా సమర్పించనున్నారు. 26న గుర్తుల కేటాయింపు, అక్టోబరు 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌, 14,15 పోస్టల్‌ బాలేట్‌ ఎన్నికలు, 17న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేయనున్నారు.

kumaram bheem asifabad- ఆర్టీసీలో ఎన్నికల నగారా
ఆసిఫాబాద్‌ బస్‌డిపో

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో పదేళ్ల తర్వాత యూనియన్‌ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కార్మికశాఖ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 21న పోటీచేసే సంఘాల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించి, 22న ముసాయిదా ఓటర్ల జాబితా సమర్పించనున్నారు. 26న గుర్తుల కేటాయింపు, అక్టోబరు 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌, 14,15 పోస్టల్‌ బాలేట్‌ ఎన్నికలు, 17న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేయనున్నారు. కాగా కార్మికశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది. చివరగా 2016లో కార్మిక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. దశాబ్ద కాలం తర్వాత 2026లో మళ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సీక్రెట్‌ బ్యాలెట్‌ విధానంలో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. డిపో పరిధిలో మొత్తం 295 మంది డ్రైవర్‌, కండక్టర్లు ఇతర కార్మికులు పని చేస్తుండగా 239 మందిి ఓటు హక్కు వచ్చే అవకాశం ఉంది. డిపోలో 2016లో ఎంప్లాయిస్‌ యూనియన్‌తో పాటు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ రెండు యూనియన్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం టీఎం యూపై అనర్హత వేటు వేయగా అధికార కాంగ్రెస్‌కు అనుబంధ సం ఘంగా ఐఎన్‌టీయూసీతో పాటు వామపక్ష సంఘం ఏఐటీయూసీ అనుబంధంగా ఎంప్లాయిస్‌ యూనియన్‌ బరిలో నిలువనున్నాయి. డిపోలో బలంగా ఉన్న ఎంప్లాయిస్‌ యూనియన్‌ గెలుపుపై ధీమాతో ఉంది. ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తుందని గెలుపు తమ సంఘానిదేనని ఐఎన్‌టీయూసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Updated Date - Sep 19 , 2026 | 11:29 PM