ఆర్టీసీలో ఎన్నికల సందడి...
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:40 PM
పదేళ్ల తరువాత ఎట్టకేలకు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు మా ర్గం సుగమం అయింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర కార్మి కశాఖ ఈ నెల 18న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎ న్నికలను రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
-రాష్ట్ర కార్మిక శాఖ గ్రీన్ సిగ్నల్
-పదేళ్ల అనంతరం ఎట్టకేలకు మోక్షం
-అక్టోబర్ 9న బ్యాలెట్ పద్ధతిలో నిర్వహణ
-అదే నెల 17న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి
మంచిర్యాల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల తరువాత ఎట్టకేలకు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు మా ర్గం సుగమం అయింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర కార్మి కశాఖ ఈ నెల 18న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎ న్నికలను రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ క్ర మంలో పోటీలో పాల్గొనే కార్మిక సంఘాల నుంచి ఈ నెల 21న అంగీకార పత్రాలు సైతం స్వీకరించగా, మంగళవారం డిపో మేనే జర్లు ముసాయిదా ఓటర్ల జాబితాను డిప్యూటీ రిటర్నింగ్ అధికా రులకు(డీసీఎల్) అందజేశారు. 24వ తేదీన వివిధ యూనియన్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుండగా, 25న వాటిని పరిశీలిం చిన అనంతరం ఓటరు జాబితాను ఎన్నికల బరిలో నిలిచే యూ నియన్లకు డిప్యూటీ రిటర్నింగ్ అధికారులు జిల్లాల వారీగా అంద జేయనున్నారు. అలాగే 26వ తేదీన పోటీలో నిలిచే యూనియ న్లకు గుర్తులు కేటాయించనుండగా, తుది ఓటరు జాబితాను డీసీ ఎల్‌లు సంబంధిత రిటర్నింగ్ అఽధికారులకు అందజేయనున్నారు. 29వ తేదీన డీసీఎల్‌ల నుంచి యూనియన్‌ల ప్రతినిధులు డమ్మీ బ్యాలెట్ పేపర్లను అందుకోనున్నారు. ఈ ప్రక్రియ అంతా ముగి సిన తరువాత అక్టోబర్ 9వ తేదీన ఉదయం 5 నుంచి సాయం త్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 14,15 తేదీ ల్లో పోస్టల్ బ్యాలెట్ ఎలెక్షన్ నిర్వహించనుండగా, 17వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
డిపోల్లో ఎన్నికల కోలాహలం....
ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో డిపోల వారీగా ఎన్నికల కోలాహలం నెలకొంది. దశా బ్దాల కాలం తరువాత ఎన్నికలు జరుగుతుండగా, కార్మిక సం ఘాల ప్రతినిధులు వివిధ అనుబంధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో ప్ర ధానంగా ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూ నియన్, ఎన్‌డబ్ల్యూఎస్, ఐఎన్టీయూసీ బరిలో దిగనున్నాయి. రా ష్ట్రంలో అఽధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబందంగా ఉన్న ఐఎన్టీయూసీ కొత్తగా ఈ సారి ఎన్నికల బరిలో నిలవనుంది. దీంతో ఆ యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేసేందుకు ఆ యూనియన్ బాధ్యులు అత్యంత పట్టుదలతో ఉన్నారు. మరోవైపు జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానంద, గడ్డం వినోద్‌లు కాంగ్రెస్‌కు చెందిన వారే కావడంతో ఆర్టీసీ ఎల క్షన్లు వారికి ప్రతిష్టాత్మకంగా మారాయి. తమ అనుబంధ యూని యన్ ఐఎన్టీయూసీ గెలుపే లక్ష్యంగా జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నారు. అలాగే బీజేపీకి అనుబంధంగా భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు కసరత్తు ప్రారంభించింది.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా....
దాదాపు పదేళ్లపాటు ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు లేక యూ నియన్లు స్తబ్దంగా ఉన్నాయి. కార్మికులకు ఏ సమస్య వచ్చినా... వారి తరుపున పోరాడే అవకాశం ఆయా యూనియన్ల నాయకు లకు లేకుండా పోయింది. మరోవైపు కార్మిక సంఘాలు ప్రభు త్వా ల నుంచి తమ డిమాండ్లను సైతం నెరవేర్చుకోలేని పరిస్థితి నెల కొంది. ప్రస్తుతం గుర్తింపు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అటు కార్మిక సంఘా లు, కార్మికులు పట్టుదలతో ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఆర్టీసీలో చివరిసారిగా 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగగా, ఏఐ టీయూసీ అనుబంధ సంఘంగా ఉన్న ఎంప్లాయీస్ యూనియ న్ గెలుపొందింది. సంస్థ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరి ష్కా రం కోసం 2019లో ఆర్టీసీలో 53 రోజులపాటు సుదీర్ఘంగా సమ్మె జరగడం, కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని తీవ్ర రూపం చేయడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి ప్ర భుత్వం కార్మిక ప్రాతినిథ్య సంఘాల సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో కార్మిక సంఘాలు నామమాత్రంగా మిగిలిపోయాయి. యూ నియన్ల ప్రాతినిథ్యానికి బదులు ప్రభుత్వం ఆర్టీసీలో వెల్ఫేర్ కమి టీలను నియమించడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చే యనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా 2026 ఏప్రిల్‌లో మూ డు రోజులపాటు జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఎన్నికల నిర్వ హణకు సానులంగా స్పందించడంతో ఎట్టకేలకు ఎలక్షన్ నిర్వహ ణకు కార్మికశాఖ ముందుకు వచ్చింది.
రీజియన్ పరిధిలో 1870 మంది ఓటర్లు....
ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో మొత్తం ఆరు డిపోలు ఉన్నాయి. వాటిలో మంచిర్యాల డిపో పరిధిలో 420 మంది ఓటర్లు ఉండగా, నిర్మల్ డిపో పరిధిలో 410, ఆదిలాబాద్ డిపోలో 406, ఉట్నూరు డిపోలో 118, భైంసా డిపోలో 208, ఆసిఫాబాద్ డిపోలో 264, రీజనల్ మేనేజర్ కార్యాలయంలో 44 మంది సిబ్బంది ఎ న్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు డిపో లో వారీగా బ్యాలెట్ పద్దతిలో నిర్వహించనుండగా, కార్మికులు, కా ర్మిక సంఘాల నాయకులు ఎవరికి వారే తమ గెలుపే లక్ష్యంగా సన్నద్ధం అవుతున్నారు.