ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:47 PM
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అధికారు లను ఆదేశించారు. మంగళవారం లక్షెట్టిపేట మున్సి పాలిటీలోని పోలింగ్ బూత్‌లతో పాటు స్ట్రాంగ్‌రూం ఏర్పాటు చేసేందుకు పాత ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అధికారు లను ఆదేశించారు. మంగళవారం లక్షెట్టిపేట మున్సి పాలిటీలోని పోలింగ్ బూత్‌లతో పాటు స్ట్రాంగ్‌రూం ఏర్పాటు చేసేందుకు పాత ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల అనం తరం కౌంటిగ్ కేంద్రాల్లో చేసే ఏర్పాట్లు తక్షణమే మొ దలు పెట్టాలన్నారు. అనంతరం పట్టణంలోని 30 ప డకల ఆసుపత్రిలో నిర్మాణం చేపడుతున్న పోస్టుమా ర్టం గదిని పరిశీలించి నిర్మాణం పనులు వేగంగా పూ ర్తి చేసి అప్పగించాలన్నారు.
ఈకార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, ఆసు పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, టీవీవీపీ అధికారి డాక్టర్ కోటేశ్వర్ పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
మంచిర్యాల కలెక్టరేట్ : మన్సిపల్ ఎన్నికల నిర్వ హణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎ న్నికల కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు. మం గళవారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వా రా కలెక్టర్, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వ హించారు. పోలింగ్ కేంద్రాలు, స్ర్టాంగ్‌రూమ్, కౌంటిం గ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పకడ్బం దీగా నిర్వహించాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, సామగ్రి, బ్యాలెట్ ప్రింటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు, నామి నేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మా ట్లాడుతూ జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పో రేషన్, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్షెట్టిపే ట లో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లతో సి ద్దంగా ఉన్నామన్నారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్‌లు తదితరులు పాల్గొన్నారు.