ఎల్‌నినోను ఎదుర్కొనేలా ఉపాధి: మంత్రి సీతక్క
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:50 AM
గ్రామాల్లో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీబీజీరామ్‌జీ పథకం కింద కూలీలకు విరివిగా ఉపాధి పనులు కల్పించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీబీజీరామ్‌జీ పథకం కింద కూలీలకు విరివిగా ఉపాధి పనులు కల్పించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. వీబీజీరామ్‌జీ పథకం ద్వారా ఎల్‌నినో కరువు నివారణ చర్యలపై గురువారం బేగంపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఇందులో పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్‌తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సబ్ కలెక్టర్లు, ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అదనపు డీఆర్డీఓలు, పీఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వీబీజీరామ్‌జీ పథకం ద్వారా ప్రతి జాబ్‌కార్డుకు ఈ 5 నెలలపాటు ప్రతినెలా రూ.7500కు తగ్గకుందా వేతనం అందేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు.