Share News

విమానాశ్రయాల నిర్మాణాల్లో.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడాలి

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:03 AM

ఆదిలాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం శిల్ప, వాస్తుకళను పరిశీలించి.. అవి ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

విమానాశ్రయాల నిర్మాణాల్లో..  తెలంగాణ సంస్కృతి ఉట్టిపడాలి
aerostation

రహదారులను సమీప రోడ్లకు అనుసంధానించాలి

చెరువులు నిర్మించి.. నీటి ప్రవాహాలను మళ్లించాలి

  • శాఖల మధ్య సమన్వయంతోనే వేగంగా పనులు

  • ఆదిలాబాద్‌, వరంగల్‌ ఎయిర్‌పోర్టులు, ఢిల్లీలోని

తెలంగాణభవన్‌ నిర్మాణాలపై సమీక్షలో సీఎం రేవంత్‌

  • సమన్వయంతోనే

వేగంగా పనులు: సీఎం

  • నిర్మాణ డిజైన్లను

పరిశీలించిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం శిల్ప, వాస్తుకళను పరిశీలించి.. అవి ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆదిలాబాద్‌, వరంగల్‌ ఎయిర్‌పోర్టులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నిర్మాణాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా విమానాశ్రయాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్‌ లైన్ల మార్పు, వాగుల ప్రవాహం మార్పు, రహదారుల మళ్లింపు, బీఎ్‌సఎన్‌ఎల్‌ లైన్లు, తాగునీటి సరఫరా లైన్ల మార్పు అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. విమానాశ్రయాల ప్రహరీ గోడ సమీపం నుంచి రహదారులు నిర్మించాలని, వాటిని సమీప జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని సూచించారు.


ఏ శాఖకు ఆ శాఖ విడిగా పనులు చేపడితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, తాగునీటి సరఫరా, నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమై బీఎ్‌సఎన్‌ఎల్‌ అధికారులతో చర్చించి ఏకకాలంలో పనులు సాగేలా చూడాలని అన్నారు. ప్రస్తుత అవసరాలనే కాకుండా భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని పనులు ముందుకుసాగేలా చూడాలన్నారు. వాగులు, నీటి ప్రవాహాలను మళ్లించాల్సి వస్తే విమానాశ్రయాల ప్రాంగణం లేదా సమీపంలో చెరువులను నిర్మించి, అక్కడి నుంచి ప్రవాహాలను మళ్లించేలా చూడాలని సూచించారు. ఆదిలాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాలతో పాటు ఢిల్లీ తెలంగాణ భవన్‌ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. పలు ఆకృతుల్లో సీఎం కొన్ని మార్పులను సూచించారు. సమీక్షలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, సీఎస్‌ సంజయ్‌ జాజు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీధర్‌, ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికా్‌సరాజ్‌, విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 07:03 AM