kumaram bheem asifabad- కుమరం భీం వర్ధంతికి పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:53 PM
కుమరం భీం వర్ధంతి సందర్భంగా జోడేఘాట్‌లో పోలీసు శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని ఎస్పీ నితికాపంత్ తెలిపారు. శనివారం జోడేఘాట్‌ను ఆమె సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ 600 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భధ్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేపడుతున్నట్టు వివరించారు.
కెరమెరి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం వర్ధంతి సందర్భంగా జోడేఘాట్‌లో పోలీసు శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని ఎస్పీ నితికాపంత్ తెలిపారు. శనివారం జోడేఘాట్‌ను ఆమె సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ 600 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భధ్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేపడుతున్నట్టు వివరించారు. కార్యక్రమ ప్రాంగణం, ప్రవేశమార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ సంబంధించిన అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని సూచించారు. పార్కింగ్, భధ్రత చర్యలను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆశోక్, వాంకిడి సిఐ వేణు గోపాల్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీష్, కెరమెరి ఎస్సై రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.