Share News

నిధుల భద్రతకు ‘ఈ- కేవైసీ’

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:14 PM

మహిళలకు ఆర్థిక ఎదుగుదలకు వారధిగా నిలుస్తు న్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రూపుల ఖాతాలకు ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది. మహిళా సంఘాలకు పారదర్శకంగా లబ్ధి చేకూరే లక్ష్యంగా ఈ-కేవైసీ- ఆధార్‌ ఫొటో అథెంటికేషన్‌ అనుసంధానం జిల్లాలో కొనసాగుతోంది. మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

నిధుల భద్రతకు ‘ఈ- కేవైసీ’
లోగో

- జిల్లాలో 8,271 సంఘాలు

- ఈనెలాఖరు వరకు పూర్తి చేసేలా చర్యలు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ఆర్థిక ఎదుగుదలకు వారధిగా నిలుస్తు న్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రూపుల ఖాతాలకు ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది. మహిళా సంఘాలకు పారదర్శకంగా లబ్ధి చేకూరే లక్ష్యంగా ఈ-కేవైసీ- ఆధార్‌ ఫొటో అథెంటికేషన్‌ అనుసంధానం జిల్లాలో కొనసాగుతోంది. మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. సంక్షేమ పథకాలు అర్హులకే అందాలని కేంద్రం భావిస్తోంది. పొదుపు సంఘాల్లో సభ్యులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సిబ్బంది ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. పొదుపు సంఘాలకు సంబంధించిన సమస్త సమాచా రాన్ని లోకోస్‌ యాప్‌లో ఇప్పటికే నిక్షిప్తం చేశారు.

- సంఘంలో చేరిన తర్వాత..

సంఘంలో చేరిన తర్వాత ఆర్థిక ప్రగతి, తీసుకున్న రుణాలు, వాయిదాల చెల్లింపులు, చెల్లించిన వడ్డీ, స్త్రీనిధి రుణాలు, కొనసాగిస్తున్న వ్యాపారం, లాభాలు, తదితర వివరాలు సభ్యురాలి వారీగా ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 386 వీవోలు ఉండగా ఎస్‌హెచ్‌జీలు 8,271 ఉండగా ఇందులో 72,462 మంది సభ్యులున్నారు. తాజాగా సభ్యులకు సంబంఽ దించిన ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఈ-కేవైసీ చేస్తున్నారు. సభ్యురాలి ఫొటో, ఆధార్‌లో ఉన్న ఫొటో ఒకేలా ఉంటే నే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుంటుంది. ఆధార్‌ అప్‌లోడ్‌ చేయించు కోకపోతే ఈ-కేవైసీ చేయలేని పరిస్థితి. సెల్‌నంబరు కూడా ఆధార్‌కు అనుసంధానం ఉండాల్సిందే. ఆధార్‌ నవీకరణ, మొబైల్‌ నంబరు అనుసంధానం కాకపోతే ముందుగా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి వివరాలు నమో దు చేసుకున్నాకే ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లో..

గ్రామీణ ప్రాంతాల్లో పొదుపురుణాలు, చిన్నతరహ వ్యాపారులు, ఉపాధి కార్యక్రమాల నిర్వహణలో సం ఫూలు కీలకంగా ఉన్నాయి. వేలాది మంది మహి ళలు సంఘాల ద్వారా ఆర్థిక కార్యకలపాల్లో భాగ స్వాములవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి సభ్యురాలి వివరాలు కచ్చితంగా ఉండడం అత్యవ సరం. ఈ-కేవైసీ పూర్తయితే సంఘాల సభ్యులు వివరాలు క్రమబద్ధీకరించడంతో పాటు భవిష్యత్‌లో డిజిటల్‌ విధానంలో సేవలు అందించేందుకు మార్గం సుగమమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేరుగా లబ్ధిరులకు చేరేలా ప్రభు త్వం ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు, రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఇలాగే జమ చేస్తున్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్‌ ద్వారా మహిళాభ్యు న్నతికి కేటాయించే నిధుల్ని సైతం దీని పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కేంద్రం ద్వారా అమలు చేస్తున్న పథకాలు నేరుగా మహిళా సంఘాల సభ్యులకు చేర్చాలన్న యోచనలో భాగంగా ఈ-కేవైసీ నమోదు చేపట్టినట్లుగా సమాచారం. దీనివల్ల అనర్హులు పొదుపు సంఘాల్లో కొనసాగేందుకు వీలుం డదు. బ్యాంకు ఖాతాలకు ఈ -కేవైసీ ద్వారా ఒకరి పేరు మీద వచ్చిన డబ్బులు మరొకరు డ్రా చేయకుం డా, గ్రూపు పేరిట నకిలీ ఖాతాలు తెరవడం వంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిం చింది. బ్యాంకు రుణాల లింకేజీ కూడా సులభతరం కానుందని చెబుతున్నారు.

ఈనెలాఖరు వరకు పూర్తి చేస్తాం..

- దత్తారావు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి

జిల్లాలో ఈ-కేవైసీ ప్రక్రియ ఈనెలాఖరు వరకు పూర్తి చేస్తాం. సభ్యులందరు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనిపై సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 11:14 PM