యాదగిరిగుట్టలో ఏకాదశి పూజలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:35 AM
యదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పూజలు సోమవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : యదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పూజలు సోమవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్వాల నడుమ వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. కొండపై శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభు స్వామిఅమ్మవారికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ రీతిలో, శ్రీపర్వతవర్థిని రామలింగేశ్వరస్వామి శివాలయంలో స్ఫటికమూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రదానాలయంలో సుప్రభాత సేవతో స్వామి అమ్మవార్లను మేల్కొల్పిన అర్చకులు మూలమూర్తులను వేదమంత పఠనాలు.. పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాతో అర్పించారు. ప్రాకార మంపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన పూజారులు విశ్వక్సేనుడికి తొలి పూజలు, సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు ఆగనుశాస్త్రరీతిలో కొనసాగాయి. శివాలయం స్ఫటిక మూర్తులను అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించారు. ఉత్సమూర్తులకు బంగారు అభరణాలతో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.35,18,704 ఆదాయం సమకూరినట్లు ఈవో జే. భవానీశంకర్ తెలిపారు.