Share News

kumaram bheem asifabad- ఎనిమిదేళ్లుగా నిరీక్షణ

ABN , Publish Date - May 12 , 2026 | 10:15 PM

జిల్లాలో అతి పెద్ద కాగితపు పరిశ్రమ ఎస్పీఎంలో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. 2014లో అప్పటి ఎస్పీఎం బిర్లా యాజమాన్యం వివిధ కారణాలతో షెడ్‌ డౌన్‌ చేసింది

kumaram bheem asifabad- ఎనిమిదేళ్లుగా నిరీక్షణ
లోగో

- కార్మికశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి

కాగజ్‌నగర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అతి పెద్ద కాగితపు పరిశ్రమ ఎస్పీఎంలో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. 2014లో అప్పటి ఎస్పీఎం బిర్లా యాజమాన్యం వివిధ కారణాలతో షెడ్‌ డౌన్‌ చేసింది. 2018లో ఎన్సీఎల్టీ కోర్టు తీర్పు ఆధారంగా నూతనంగా చేపట్టి జేకే మిల్లు యాజమాన్యం కార్మికులపై ఆంక్షలు విధించి విధుల్లోకి తీసుకుంది. కార్మికులకు ఉపాధి కలుగుతోందన్న లక్ష్యంతో అప్పటి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవతో సీఎం కేసీఆర్‌ ఈ మిల్లును తెరిపించారు. కానీ ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల నిర్వహణపై ముందడుగు పడడం లేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా మిల్లులో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలని కార్మికులంతా గతంలో రాష్ట్ర నుంచి నాయకుల నుంచి కేంద్ర మంత్రుల వరకు వినతి పత్రాలు సమర్పించారు. ఇంత వరకు ఎలాంటి పురోగతి లేని పరిస్థితి ఏర్పడింది. ిఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కార్మిక శాఖ ఉన్నతాధికారులకు గత ఆరు నెలల క్రితం వినతి పత్రాలు సమర్పించారు. మిల్లులో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల కోసం ఇక్కడున్న కార్మిక సంఘాలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని అందరికి నోటీసులను పంపించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కార్మిక శాఖ అధికారులకు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు సమర్పించినప్పటికీ ఎన్నికల విషయంలో ఎటూ తేలని పరిస్థితి ఏర్పడింది. రెండ్రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు కూడా కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శికి ఎస్పీఎంలో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలని వినతిపత్రం అందజేశారు. ఎస్పీఎం మిల్లులో కార్మికులకు పడరాని పాట్లు పడుతున్నారని, యాజమాన్యం ఉత్పత్తిపై దృష్టి సారిస్తోందని, కార్మికు ల హక్కులను రాలస్తోందని స్పష్టంగా వివరించారు.

- 393 మంది పర్మినెంటు కార్మికులు..

ఎస్పీఎంలో ప్రస్తుతం 393 మంది పర్మినెంటు కార్మికులు పని చేస్తున్నారు. అలాగే యాజమాన్యం కార్మికులపై పని ఒత్తిడి అధికంగా చేస్తున్నారని, మిల్లులో వివిధ డిపార్టుమెంటుల్లో కాంట్రాక్టు పద్ధతిన పనులు నిర్వహిస్తున్నారు. మిల్లు పునరుద్ధరణ జరిగిన తర్వాత రెండు వందల మంది కార్మికులను ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. ఇందులో కొంత మంది కార్మికులు కూడా మృతి చెందారు. కొంత మంది పదవీ విరమణ కూడా చేశారు. గతంలో పని చేసిన పర్మినెంటు కార్మికులను విధుల్లోకి తీసుకుంటే ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు పెరిగే మార్గం ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు కార్మికులు యాజమాన్యం తీరుపై మండి పడుతున్నారు. మిల్లు పునరుద్ధరణ తర్వాత ఇక్కడి ట్రేడ్‌ యూనియన్లకు అర్హత లేదని ఎస్పీఎం యాజమాన్యం గత రెండేళ్ల క్రితం హైకోర్టులో కేసు వేసింది. ఇందుకు ఇక్కడున్న కార్మిక సంఘాల నాయకులు తమకు అర్హత ఉందని పూర్తి ఆధారాలు హైకోర్టుకు సమర్పించారు. దీంతో ఎస్పీఎం యాజమాన్యం వేసిన కేసు కొట్టేసింది. మళ్లీ తాజాగా నూతన నాలుగు లేబర్‌ విధానం ప్రకారం కార్మిక శాఖకు బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని కార్మిక శాఖపై యాజయాన్యం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పరిశ్రమల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఇక్క డ మాత్రం యాజమాన్యం ఎన్నికలకు బ్రేక్‌ వేస్తుండటంతో ఆయా ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు యాజమాన్యం తీరుపై మండి పడుతున్నా రు. స్థానికేతరులకు ఎక్కువ జీతాలిస్తున్నారని, తమకు తక్కువ జీతాలిస్తున్నట్టు కార్మిక సంఘాలు మండి పడుతున్నారు. ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు చొరవ తీసుకొని సిర్పూరు పేపరు మిల్లులో వెంటనే ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..

- అంబాల ఓదేలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు

ఎస్పీఎంలో ట్రేడ్‌ యూనియన్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. మిల్లు పునరుద్ధరణ జరిగి ఎనిమిది సంవత్సరాలు గడిచింది. ఇంత వరకు ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించక పోవడం దారుణం. కార్మికుల హక్కులను యాజమాన్యం కాలరాస్తోంది. కనీసం హక్కుల కోసం పోరాడేందుకు వెలుసు బాటు ఉండే ట్రేడ్‌ యూనియన్‌లను లేకుండా యాజమాన్యం చేస్తోం ది. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రత్యేక చొరవ చూపాలి. ప్రస్తుతం ఉన్న యాజమాన్యం కార్మికుల పట్ల వివక్షత చూపు తోంది. గతంలో పని చేసిన పర్మినెంటు కార్మికులను ఇంత వరకు విధుల్లోకి తీసుకోలేదు. యాజమాన్యం తీరు బాగాలేదు. ఈ సమస్యలు తీరాలంటే ఎన్నికలు నిర్వహించాలి

Updated Date - May 12 , 2026 | 10:16 PM