Share News

kumaram bheem asifabad-కొండెక్కిన కోడిగుడ్డు ధర

ABN , Publish Date - Nov 12 , 2026 | 10:26 PM

కోడిగుడ్డు ధరలు కొండెక్కాయి. నాటు కోడి ధరలు అందనంత దూరంగా ఉన్నాయి. చికెన్‌, మటన్‌ ఏలాగు కొనలేని నిరుపేదలు పెరిగిన ధరలతో నేడు కోడిగుడ్డు వైపు కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. మాంస, శాఖాహారు లందరూ పౌష్టికాహారంగా తీసుకునే గుడ్డు ఇప్పుడు పేదలు తినలేనంత దూరంగా పోయింది.

kumaram bheem asifabad-కొండెక్కిన కోడిగుడ్డు ధర
గుడ్లు

వాంకిడి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కోడిగుడ్డు ధరలు కొండెక్కాయి. నాటు కోడి ధరలు అందనంత దూరంగా ఉన్నాయి. చికెన్‌, మటన్‌ ఏలాగు కొనలేని నిరుపేదలు పెరిగిన ధరలతో నేడు కోడిగుడ్డు వైపు కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. మాంస, శాఖాహారు లందరూ పౌష్టికాహారంగా తీసుకునే గుడ్డు ఇప్పుడు పేదలు తినలేనంత దూరంగా పోయింది.ఇంతగా ధరలు పెరుగుతున్న గుడ్లకు మాత్రం డిమాండ్‌ తగ్గడం తేదు. గత నెల రూ. 6 ఉన్న ధర ప్రస్తుతం 8 పలుకుతుంది. గ్రామాల్లో అయితే ఏకంగా రూ 8 వరకు విక్రయిస్తున్నారు. గత పదిరోజుల క్రితం ట్రే గుడ్లు 30 ధర రూ. 190 ఉండగా ప్రస్తుతం రూ. 220 విక్రయి స్తున్నారు. కోళ్ల దాణా, నిర్వహణ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్ల ధరలు అమాంతంగా పెరగడంతో మధ్యాహ్న భోజనం, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు గుడ్లు అందించేందుకు వెనుకడుగువేస్తున్నారు. కాగా మార్కెట్‌లో మటన్‌, చికెన్‌ ధరలు కూడా అమాంతం పెరిగాయి. మటన్‌ కిలో రూ. 900, చికెన్‌ రూ. 280 పలుకుంది. ఈ ధరలతో ఎక్కవ మొత్తం గుడ్డుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా తర్వాత వ్యాధి నిరోధక శకి ్తని పెంపొదించుకునేందుకు వైద్యులు కూడా ఉడక బెట్టిన గుడ్డు నిత్యం తినాలని సూచించడంతో గుడ్డుపై ప్రజలు ఆసక్తి పెంచుకున్నారు. ఇతర పోషక పదార్థాలతోపాటు గుడ్డును తప్పనిసరిగా తినడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు మార్కెట్లో గుడ్ల ధరలను అమాతం పెంచేస్తున్నారు. వారం అంతా కూరగాయాల భోజనం తిన్నా... అదివారం లేదా ఇంటికి బంధువులు వచ్చినా.. ఏ చిన్న ఫంక్షన్‌ అయినా చికెన్‌ తప్పనసరి. అయితే బాయిలర్‌ కోడి ఎంత తిన్నా.. నాటుకోడికి ఉండే రుచే వేరు. అందుకే రేటు కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోడి కిలో రూ. 800 పైగా విక్రయిస్తున్నారు. కోడిని బట్టి ఒక్కో దానికి సుమారు రూ. 800 నుంచి వెయ్యి వరకు అమ్ముతున్నారు. నాటు కోడి ధరలు ఏక్కువగా ఉండడం తో ప్రజలు బాయిలర్‌ కోళ్లనే మొక్కులు తీర్చుకునేందుకు వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో నాటు కోళ్ళకు బాగా డిమాండ్‌ ఉండడంతో పాటు అందుకు అనుగుణంగా కోళ్లు అందుబాటులో లేకపోవడం కూడా ధరలు పెరగ డానికి ఓ కారణం. ఏది ఏమైనప్పటకి గుడ్ల ధరలు విపరితంగా పెరగడంతో పాటు నాటు కోడి ధరలు కూడా పెరగడంతో సామాన్య ప్రజలకు గుడ్లు, నాటు కోడి తినలేని పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు.

Updated Date - Nov 12 , 2026 | 10:26 PM