Share News

kumaram bheem asifabad- కొండెక్కిన కోడిగుడ్డు ధర

ABN , Publish Date - Jul 17 , 2026 | 10:50 PM

నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కోడి గుడ్డుధర కూడా అమాంతం పెరిగింది. చికెన్‌, మటన్‌ ఏలాగు కొనలేని నిరుపేదలు పెరిగిన ధరలతో నేడు కోడిగుడ్డు వైపు కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. మాంస, శాఖాహారులందరూ పౌష్టికాహారంగా తీసుకునే గుడ్డు ఇప్పుడు పేదలు తినలేనంత దూరంగా పోయింది. ఇంతగా ధరలు పెరుగుతున్న గుడ్లకు మాత్రం డిమాండ్‌ తగ్గడం తేదు.

kumaram bheem asifabad- కొండెక్కిన కోడిగుడ్డు ధర
గుడ్ల్జు

వాంకిడి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కోడి గుడ్డుధర కూడా అమాంతం పెరిగింది. చికెన్‌, మటన్‌ ఏలాగు కొనలేని నిరుపేదలు పెరిగిన ధరలతో నేడు కోడిగుడ్డు వైపు కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. మాంస, శాఖాహారులందరూ పౌష్టికాహారంగా తీసుకునే గుడ్డు ఇప్పుడు పేదలు తినలేనంత దూరంగా పోయింది. ఇంతగా ధరలు పెరుగుతున్న గుడ్లకు మాత్రం డిమాండ్‌ తగ్గడం తేదు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్క కోడిగుడ్డు ధర రూ. 8 కు విక్రయిస్తుండగా పల్లె ప్రాంతాల్లో రూ 9 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో మటన్‌, చికెన్‌ ధరలు కూడా అమాంతం పెరగడంతో ఎక్కవ మొత్తం గుడ్డుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా తర్వాత వ్యాధి నిరోధక శకి ్తని పెంపొదించుకునేందుకు వైద్యులు కూడా ఉడక బెట్టిన గుడ్డు నిత్యం తినాలని సూచించడంతో గుడ్డుపై ప్రజలు ఆసక్తి పెంచుకున్నారు. ఇతర పోషక పదార్థాలతోపాటు గుడ్డును తప్పనిసరిగా తినడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు మార్కెట్లో గుడ్ల ధరలను అమాతం పెంచేస్తున్నారు. గతంతో పోలిస్తే గుడ్డు ధర పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. ఏది ఏమైనప్పటకి గుడ్ల ధరలు విపరితంగా పెరగడంతో పాటు చికెన్‌ ధరలు కూడా అందనంత దూరుంగా ఉండడంతో సామాన్య ప్రజలకు గుడ్లు, చికెన్‌ తినలేని పరిస్థితి నెలకొన్నది.

Updated Date - Jul 17 , 2026 | 10:51 PM