విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:33 PM
నాగర్‌కర్నూల్ పట్టణంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ కోరారు.
కందనూలు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యో తి) : నాగర్‌కర్నూల్ పట్టణంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం గు రువారం విద్యుత్ శాఖ ఎస్‌ఈ కేవీ.నరసిం హారెడ్డిని కలిసి వివరించారు. పట్టణంలో విద్యుత్ సరఫరా, లో ఓల్టేజీ, తదితర సమ స్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభా లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ చెప్పారని, సునేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసి పల్ వైస్ చైర్మన్ బాదం రమేశ్, కౌన్సిలర్లు శంకర్, పద్మమ్మ, శ్రీను, కాంగ్రెస్ నాయకులు ఆవంచ రాజు, రాజేశ్‌గౌడ్, హరీశ్‌గౌడ్, హర్షవ ర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.