Share News

నిధుల మంజూరుకు కృషి

ABN , Publish Date - Sep 27 , 2026 | 11:46 PM

కల్వకుర్తి కోర్టు నూతన భవన నిర్మాణానికి అవ సరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.

నిధుల మంజూరుకు కృషి
ఎమ్మెల్యే నారాయణరెడ్డితో వినతిపత్రం అందజేస్తున్న న్యాయవాదులు

- కోర్టు భవన నిర్మాణంపై ఎమ్మెల్యే కశిరెడ్డిని కలిసిన న్యాయవాదులు

కల్వకుర్తి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి కోర్టు నూతన భవన నిర్మాణానికి అవ సరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి భవన నిర్మాణ ప్రతిపా దనలను త్వరగా సిద్ధం చేయిస్తానని తెలిపారు. కల్వకుర్తి కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో న్యాయవాదులు ఆదివారం హైదరాబాద్‌లో ని ఎమ్మెల్యే నివాసంలో మునిసిపల్‌ చైర్మన్‌ బృం గి రత్నమాల, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌ కుమార్‌లతో కలిసి వారు ఎమ్మెల్యేను కలిశారు. వారు ఎమ్మెల్యేను పుష్పగుచ్ఛం అందజేసి శాలు వాతో సత్కరించారు. అనంతరం కోర్టు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయా లని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజే శారు. న్యాయవాదుల వినతిపై ఎమ్మెల్యే స్పం దించి స్థానిక ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈతో ఫోన్‌లో మా ట్లాడారు. కోర్టు నూతన భవన నిర్మాణానికి సం బంధించిన ప్రతిపాదనలు, ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ప్రతి పాదనలను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్య క్షుడు ఎస్‌.మల్లేష్‌, ప్రఽధాన కార్యదర్శి జమీల్‌ అహ్మద్‌, ఉపాధ్యక్షుడు నాగరాజు, సీనియర్‌ న్యా యవాదులు వెంకట్‌రెడ్డి, కృష్ణయ్య, భాస్కర్‌రెడ్డి, వెంకటరమణ, లక్ష్మణ్‌, రాజు, ఎముక జంగయ్య జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 11:46 PM