kumaram bheem asifabad- చెరువు మరమ్మతు పనులకు కృషి
ABN , Publish Date - May 19 , 2026 | 10:25 PM
: అంబగట్ట చెరువు శిథిలావస్థకు చేరడంతో సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దాని మరమ్మతుల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని అంబగట్ట సమీపంలోని శిథిలావస్థకు చేరిన చెరువును మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. తక్షణమే అంబగట్ట చెరువు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
బెజ్జూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): అంబగట్ట చెరువు శిథిలావస్థకు చేరడంతో సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దాని మరమ్మతుల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని అంబగట్ట సమీపంలోని శిథిలావస్థకు చేరిన చెరువును మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. తక్షణమే అంబగట్ట చెరువు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కొండల మధ్య సహజంగా ఏర్పడిన చెరువు ఆయకట్టు కింద సుమారు 300 ఎకరాల్లో భూములకు సాగునీరు అందించడంతో పాటు పశువులకు, వన్యప్రాణులకు తాగునీరు అందే అవకాశం ఉందని అన్నారు. శిథిలావస్థకు చేరిన చెరువును పునరుద్దరించి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందేలా ఏర్పాటు చేస్తానని రైతులకు హామి ఇచ్చారు. అనంతరం మండలంలోని కుకుడ గ్రామానికి చెందిన మాజీ మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి భర్త శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంకు గురి కావడంతో ఆయన నివాసిని వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట నీటిపారుదల శీఖ డీఈ భద్రయ్య, ఏఈ మణితేజ, నాయకులు మనోహర్‌గౌడ్, బాపు, సుగుణాకర్, ముత్తయ్య, వసిఉల్లాఖాన్, రాజారాం, శ్యాంసుందర్, రమేష్, రాకేష్, కిష్టయ్య, భిక్షపతి, సంజీవ్, సంతోష్ తదితరులు ఉన్నారు.