పర్యావరణ పరిరక్షణకు కృషి
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:28 PM
రివిగా మొక్కలు నాటడమే కాకుండా వా టిని సంరక్షించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి అన్నారు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి
కల్వకుర్తి/ వెల్దండ/, ఆగస్టు 25 (ఆంధ్రజ్యో తి): విరివిగా మొక్కలు నాటడమే కాకుండా వా టిని సంరక్షించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి అన్నారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని జేపీనగర్ గురుకులంలో నిర్వహించిన మొక్కలు నాటే కా ర్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్న మాల, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్ లతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనం తరం జన్మదిన వేడుకల సందర్భంగా మునిసిప ల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాలను ఎమ్మెల్యే శా లువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో ముని సిపల్ వైస్ చైర్మన్ షానవాజ్‌ఖాన్, మునిసిపల్ కమిషనర్ మహ మ్మద్ షేక్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షు డు బచ్చు రామకృష్ణ, సంబంధిత శాఖ అధికారు లు, పలువురు కౌన్సిలర్లు, పలవురు మాజీ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఒక్క ఓటూ తొలగిపోవొద్దు
వెల్దండ సమీపంలోని టీసీజీ గార్డెన్‌లో నియోజకవర్గస్థాయి బీఎల్‌ఏల సమావేశం జరిగింది. సమావేశానికి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాచమళ్ల సిద్దేశ్వర్‌తో కలిసి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్‌ఏలదని ఎమ్మెల్యే అన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, చిరునామాల మార్పు తదితర అంశాలపై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి, కార్యదర్శులు మోతీలాల్, శంకర్ నాయక్, శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ ఉమాసంజీవ్‌కుమార్, నర్సింహ, పార్టీ అధ్యక్షుడు హరికిషన్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్యగౌడ్, పర్వత్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత
వెల్దండ ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొని అర్హత కలిగిన 17 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు. సమావేశంలో ఎంపీడీవో సులోచన, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఏఈ పల్లవి, వివిద గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు ఉన్నారు.