kumaram bheem asifabad- అంగన్‌వాడీల వేతనాల పెంపునకు కృషి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:04 PM
అంగన్‌వాడీ టీచర్ల, ఆయాల వేతనాల పెంపు కోసం కృషి చేస్తామని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లిలో మంగళవారం పోషణ మాసం వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ, ఆయాలకు చాలీచాలని వేతనంతో విధులు నిర్వహిస్తున్నట్టు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జీతాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాకారంతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. వీటిని అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాగజ్‌నగర్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ టీచర్ల, ఆయాల వేతనాల పెంపు కోసం కృషి చేస్తామని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లిలో మంగళవారం పోషణ మాసం వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ, ఆయాలకు చాలీచాలని వేతనంతో విధులు నిర్వహిస్తున్నట్టు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జీతాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాకారంతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. వీటిని అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంతోని పిల్లలో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. కార్యక్రమంల ఇన్‌చార్జి బోదాసు మాధవి, డీడబ్ల్యువో స్వరూప, సీడీపీవో రెబెకా, సూపర్‌వైజర్ చందన, మాధవి, సర్పంచ్‌లు సుమన్, కోట వేణు, నాయకులు పుల్ల ఆశోక్, దోతుల శ్రీనివాస్, బాపురావు, పెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లను సన్మానించారు.
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
పెంచికల్‌పేట్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల పరిధిలోని అగర్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారి విద్యా సామర్థ్యాలను పరీక్షించేందుకు పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు ఉత్సాహంగా సమాధానాలు చెప్పడంతో ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన విభాగాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.