Share News

రూరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు కృషి

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:21 PM

రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లో రూరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ట్లు రెడ్డి సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షు డు, ఎల్లూరు గ్రామ వాసి బండి వెంకటరెడ్డి తె లిపారు.

రూరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు కృషి
బండి వెంకటరెడ్డిని సన్మానిస్తున్న రెడ్డి సేవా సమితి సభ్యులు

- కొల్లాపూర్‌ రెడ్డి సేవా సమితి నిర్ణయం

కొల్లాపూర్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లో రూరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ట్లు రెడ్డి సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షు డు, ఎల్లూరు గ్రామ వాసి బండి వెంకటరెడ్డి తె లిపారు. ఆదివారం కొల్లాపూర్‌లోని రెడ్డి సేవా సమితి కార్యాలయంలో కమిటీ సమావేశం జరి గింది. నియోజకవర్గ విద్యార్థులకు, యువతకు విద్యాదానం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయ న పేర్కొన్నారు. రూరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల కోసం తన సొంత ఐదు ఎక రాల భూమి ఇస్తానని వెంక ట్‌రెడ్డి ప్రకటించారు. ఫంక్షన్‌ హాల్‌ పునరుద్ధరణకు కృషి చే స్తున్నట్లు తెలిపారు. ప్రతీ మండలానికిరెడ్డి మహిళా సంఘంతో పాటు మండల స్థాయి రెడ్డి సంఘాలను ఏ ర్పాటు చేసేందుకు నిర్ణయిం చారు. రానున్న రోజుల్లో రెడ్డి సేవా సమితిని విస్తృత స్థాయి లో ప్రతీ గ్రామంలో ఏర్పాటు అయ్యేలా సంఘం సభ్యులు కృషి చేయాలని తీర్మానించారు. అనం తరం రెడ్డి ప్రజాప్రతినిధులను మహిళా సభ్యులను సన్మానించారు.

Updated Date - Mar 22 , 2026 | 11:21 PM