మౌలిక వసతుల కల్పనకు కృషి
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:28 PM
అ చ్చంపేట పట్టణంలో మౌలిక వసతుల కల్పన కు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
- అచ్చంపేట పట్టణంలో మార్నింగ్ వాక్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : అ చ్చంపేట పట్టణంలో మౌలిక వసతుల కల్పన కు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా పట్టణంలోని రాంనగర్ కాలనీలో మునిసిపల్ అధికారులతో కలిసి శనివారం పలు వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించా రు. కాలనీవాసులతో సమావేశమై వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను సం బంధిత మునిసిల్ అధికారులు, కమిషనర్, వా ర్డు ఆఫీసర్లకు తెలియజేసి పరిష్కరించాలని ఆ దేశించారు. ప్రధాన రహదారి బస్టాండ్ సమీ పంలో ఏర్పాటు చేసిన బ్రిడ్జిని పరిశీలించారు. రోడ్డు ఎత్తు పెంచి వాహన ఛోదకులు ఇబ్బందు లు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారు లకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మునిసిపల్ అధికారు లు, వార్డు సిబ్బంది పాల్గొన్నారు.