Share News

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:06 PM

గ్రామాల్లో మౌ లిక సదుపాయాలు కల్పించ డమే ప్రభుత్వ లక్ష్యమని ఎ మ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
గడ్డంపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

తెలకపల్లి, జనపరి 24 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో మౌ లిక సదుపాయాలు కల్పించ డమే ప్రభుత్వ లక్ష్యమని ఎ మ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. శ నివారం మండల పరిధిలోని గడ్డంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే నూతన గ్రామ పంచాయతీ భ వనాన్ని ప్రారంభించి మాట్లాడా రు. గ్రామంలో కలియతిరుగు తూ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి తొందరలోనే నూతన భవనాన్ని మంజూరు చేయిస్తామని చెప్పి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. వారితో పాటు గ్రామ సర్పంచ్‌ వెన్నెల శేఖర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణా రావు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 11:06 PM