Share News

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:39 PM

గ్రామాల్లోని మహిళ సంఘాల సభ్యుల్లో నిరక్షరాస్యులుగా ఉన్న వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అమ్మకు అక్షర మాల ఉల్లాస్‌ అక్షర కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జి ల్లా వయోజన విద్యాధికారి అజ్మీర పురుషోత్తం నా యక్‌ అన్నారు.

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి
మామిడిపల్లిలో నిర్లక్షరాస్యులకు చదువుపై అవగాహన కల్పిస్తున్న జిల్లా వయోజన విద్యాధికారి

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి

జిల్లా వయోజన విద్యాధికారి అజ్మీర పురుషోత్తంనాయక్‌

దండేపల్లి జనవరి 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని మహిళ సంఘాల సభ్యుల్లో నిరక్షరాస్యులుగా ఉన్న వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అమ్మకు అక్షర మాల ఉల్లాస్‌ అక్షర కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జి ల్లా వయోజన విద్యాధికారి అజ్మీర పురుషోత్తం నా యక్‌ అన్నారు. శనివారంరాత్రి మండలంలోని మా మిడిపల్లిలో ఉల్లాస్‌ అక్షరాస్యత వయోజన విద్యా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడు తూ నిర్లక్షరాస్యులకు అక్షరాలలు దిద్ది చదువు నేర్చు కోవడానికి వయసుతో సంబంధం లేదని, 15 ఏళ్లు నుంచి 60ఏళ్లు వరకులోపు వారందరు చదువురాని వారు చదువుకోవాలన్నారు. చదువుకునే వారికే సమా జంలో మంచి గౌరవ ఉంటుందన్నారు. ఉల్లాస్‌ పథ ఽకం ద్వారా చదువురాని వారికి అక్షరాస్యత కేంద్రాలకు నిర్లక్షరాస్యులను ప్రతి ఒక్కరూ రావడమే కాకుండా చదువు నేర్చుకోకుని 100రోజుల్లో అక్షరాస్యులుగా తయారు చేసే విదంగా కృషి చేయాలన్నారు. ఉల్లాస్‌ అమ్మకు అక్షరమాల కేంద్రాలు సమర్థవంతంగా కొన సాగడానికి ప్రతి మండల విద్యాధికారులు మండల స్థాయి, గ్రామస్థాయిలో మానిటరింగ్‌ చేసి ప్రతి వా రం మండలస్థాయిలో గ్రామస్థాయిలో ప్రత్యేక సమా వేశాలు ఏర్పాటు చేసి ప్రగతి నివేదికలను జిల్లా వి ద్యాధికారి కార్యలయాలు, వయోజన విద్యా కార్యల యాలకు అందజేసేయాలన్నారు. అనంతరం నిరక్షరా స్యులతో అక్షర వికాసం వాచకం ద్వారా నేర్చుకున్న ఐదు పాఠాల వరకు అభ్యాసకుల వారి ద్వారా చది వించి వ్రాయించి పరిశీలించారు. ఇందులో కొంత మంది చక్కగా తప్పులు లేకుండా చదవగలిగారు, రాయగా

లిగారు, కొంత మంది చిన్నచిన్న లెక్కలు సులభంగా చేయగలిగారు. ఈసందర్బంగా గ్రామస్థాయి వివో, ఓబి, వి

వోఏల తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఎల్తెపు వైష్ణవి, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు అల్లంల అనిత, రిటైడ్‌ ఎంఈవో నాగేమల్లేశ్వర్‌రావు, డిఆర్‌పిలు కొండు జనార్థన్‌, రెడ్డిమల్ల ప్రకాశం, వివో సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 11:39 PM