హెచ్‌ఐవీ నివారణకు కృషి చేయాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:12 PM
హెచ్‌ఐవీ వ్యాప్తిని నివారించడా నికి ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధి కారి డాక్టర్ కే.రవికుమార్ కోరారు.
- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కే రవికుమార్
కందనూలు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యో తి) : హెచ్‌ఐవీ వ్యాప్తిని నివారించడా నికి ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధి కారి డాక్టర్ కే.రవికుమార్ కోరారు. ప్ర జాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా నాగర్‌కర్నూల్ పాత కలెక్టరేట్ ఆ వరణలో గురువారం నిర్వహించిన ఎయిడ్స్ అ వగాహన ర్యాలీలో అందరిచే డీఎంహెచ్‌వో ప్ర తిజ్ఞ చేయించారు. అనంతరం జెండా ఊపి రెడ్ రన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ, చికిత్స గురించి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని క్షేత్రసహాయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జీజీ హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, సివి ల్ సర్జన్ ఆర్‌ఎంవో డాక్టర్ రవిశంకర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ ప్రదీ ప్, డాక్టర్ రఫిక్, డాక్టర్ సురేష్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ భరత్‌కుమార్ రెడ్డి, వైద్యా ధికారులు డాక్టర్‌వాణి, సృజన పాల్గొన్నారు.