Share News

కూలీల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:34 PM

వీబీజీరామ్‌జీ పథకంలో కూ లీల సంఖ్యను పెంచేందుకు స్థానిక అధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీఆర్‌డీవో కిషన్‌ సూచించారు. సోమవారం వేమనపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో 16వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.

కూలీల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి
వేమనపల్లిలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో మాట్లాడుతున్న డీఆర్‌డీవో కిషన్‌

డీఆర్‌డీవో కిషన్‌

వేమనపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వీబీజీరామ్‌జీ పథకంలో కూ లీల సంఖ్యను పెంచేందుకు స్థానిక అధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీఆర్‌డీవో కిషన్‌ సూచించారు. సోమవారం వేమనపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో 16వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సం దర్భంగా డీఆర్‌డీవో మాట్లాడుతూ ఎల్‌నినో దృష్య్టా జలసిరి కార్యక్రమంలో భాగంగా మండలంలో ఇంకుడుగుంతలు నిర్మించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అలాగే గ్రామాల్లో పశువుల కోసం నీటి తొట్టిలు, గడ్డి పెంప కం కోసం కృషి చేయాలన్నారు. మండలంలో వారం రోజుల నుంచి నిర్వ హించిన సామాజిక తనిఖీలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయి. అ వకతవకలకు పాల్పడిన సిబ్బందికి రూ. 9 వేల పెనాల్టీ, రూ. 16,883 రిక వరీకి ఆదేశించారు. అనంతరం వేమనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని డీఆర్‌డీవో తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా ఆన్‌లైన్‌ ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, ఎస్‌ఆర్‌పీ నాగరాజు, ఎంపీవో వెం కటేష్‌, ఏపీవో మహేశ్వర్‌రెడ్డి, ఈసీ మధుకర్‌, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 11:34 PM