వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:35 AM
వ్యాధుల నియంత్రణలో భాగంగా దోమల వృద్ధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : వ్యాధుల నియంత్రణలో భాగంగా దోమల వృద్ధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం సమీకృత కలెక్టరఏట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 99 రోజుల కార్య చరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 16 నుంచి మే 15 వరకు జిల్లాలో వెక్టర్ బోర్న్ వ్యాధుల నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దోమలు, టిక్స్,ప్లీలు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించేందుకు వైద్య శాఖ ముందుండి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో పారిశుధ్య్ద కార్యక్రమా లను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సరిపడ నిధులు అందుబాటులో ఉన్నాయని, సరైన విధంగా వినియోగించాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రాలు, ఉప కేంద్రాల పరిధిలోని గ్రా మాల్లో నెల రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జిల్లాలో తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ఆధ్వర్యంలో నెల రోజలు పాటు జిల్లాలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాది గ్రస్తులను గుర్తించి చికిత్సలు అందించాలన్నారు. అ నంతరం కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. ఈకార్యక్రమంలో డీఎంహెచ్‌వో అనిత, డీపీవో వెంకటేశ్వర్‌రావు, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య, ప్రభుత్వ ఆసు పత్రి పర్యవేక్షకులు వేదవ్యాస్, టీహబ్ ప్రతినిధి శిల్ప, డీపీవో ప్రశాంతి, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు, ఎంటీఎస్ శ్రీనివాస్, కిరణ్, పద్మ, వసుమతి, వెంకటేశ్వర్ పాల్గొన్నారు.