Share News

విద్యార్థినుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:31 PM

కస్తూర్బా పాఠశాలల్లో వి ద్యా ప్రమాణాలను మెరుగుపరచ డంతో పాటు విద్యార్థినులకు మెరు గైన వసతులు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ కుమార్‌ అన్నారు.

విద్యార్థినుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి
గణితంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న డీఈవో రమేశ్‌ కుమార్‌

- కేజీబీవీలో డీఈవో రమేశ్‌ కుమార్‌ ఆకస్మిక తనిఖీ

తెలకపల్లి, నవంబరు 1 (ఆంధ్ర జ్యోతి) : కస్తూర్బా పాఠశాలల్లో వి ద్యా ప్రమాణాలను మెరుగుపరచ డంతో పాటు విద్యార్థినులకు మెరు గైన వసతులు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని రాకొండ కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం పరిధిలో ని తెలకపల్లి మండలాల్లో ఉన్న కస్తూర్బా గాం ధీ బాలికల విద్యాలయాలను సందర్శించిన పా ఠశాలల నిర్వహణ విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు, బోధన పరిశీలిం చారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. వి ద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షిం చాలని ఆదేశించారు. పది, ఇంటర్మీడియట్‌ వి ద్యార్థినులపై ప్రత్యేక దృష్టి సారించి మైరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, ప్రత్యే క అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. డీఈవో వెంట జిల్లా టెస్ట్‌ బుక్‌ మేనేజర్‌ నరసింహులు, కేజీబీవీ పాఠశా లల ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:31 PM