kumaram bheem asifabad-కేసుల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలి
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:01 PM
జిల్లా న్యాయస్థాన సముదా యంలో కొనసాగుతున్న అండర్ ట్రయల్ కేసుల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తి వీరయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ స్థాన సముదాయంలో గల కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికారి సంకేత్‌మిత్ర, జిల్లా కలెక్టర్ కె.హరిత, జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, ప్రత్యేక సబ్ జైలు పర్యవేక్షకులు ప్రేంకుమార్‌లతో కలిసి కేసులకు సంబంధించి సమీక్ష నిర్వహించారు
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయస్థాన సముదా యంలో కొనసాగుతున్న అండర్ ట్రయల్ కేసుల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తి వీరయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ స్థాన సముదాయంలో గల కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికారి సంకేత్‌మిత్ర, జిల్లా కలెక్టర్ కె.హరిత, జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, ప్రత్యేక సబ్ జైలు పర్యవేక్షకులు ప్రేంకుమార్‌లతో కలిసి కేసులకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అండర్ ట్రయల్ కేసులలో కక్షిదారుల పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చార్జ్ షీట్ వేసినవి, వేయని కేసులకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. బెయిల్ మంజూరు అయిన వెంట నిర్ణిత నిబంధనలను పాటిస్తూ సంబంధిత వ్యక్తులను విడుదల చేయాలని, అండర్ ట్రయల్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.