Share News

సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:14 PM

చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు కౌన్సిలర్లను కలుపు కుని పట్టణ అభివృద్ధికి కృషి సారించాలని ఎ మ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి
బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గాన్ని అభినందిస్తున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- ఎమ్మెల్యే డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి

- బాధ్యతలు స్వీకరించిన మునిసిపాలిటీ పాలకవర్గం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఫిబ్రవరి26 (ఆంధ్రజ్యో తి) : చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు కౌన్సిలర్లను కలుపు కుని పట్టణ అభివృద్ధికి కృషి సారించాలని ఎ మ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. గు రువారం నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీ పాలక వర్గం బాధ్యతలు చేపట్టింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే హాజరై చైర్మన్‌ చాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మె ల్యే సమక్షంలో మునిసిపల్‌ చైర్మన్‌ తీగల సు నేంద్ర, వైస్‌ చైర్మన్‌ బాదం రమేష్‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు కౌ న్సిలర్లు నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను శాలు వా, పుష్పగుచ్ఛాలతో సన్మానించి అభినందిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అదేవిధంగా ప్ర జాసమస్యలు పరిష్కరించేందుకు పాలకవర్గం కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, ముని సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 11:14 PM