Share News

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Nov 29 , 2026 | 10:35 PM

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఎస్సీ సెల్‌ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కాం గ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన్‌ పైడి మల్ల నర్సింగ్‌లు పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ఎస్సీ సెల్‌ నాయకులకు నియామక పత్రాలను అందిస్తున్న కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి

జైపూర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఎస్సీ సెల్‌ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కాం గ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన్‌ పైడి మల్ల నర్సింగ్‌లు పేర్కొన్నారు. ఆదివారం జైపూర్‌ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్‌ మండల కమిటీతో పాటు గ్రామ అధ్యక్షుల నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ మంచిర్యా ల జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచే యా లని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రతి ఇంటికి వివ రించాలన్నారు. ఎస్సీ సెల్‌ మండల ఉపాధ్యక్షుడిగా దూట పండరి, కుంట నర్సయ్య, ప్రధాన కార్యదర్శులుగా గద్దల రాకేష్‌, మీసాల అశోక్‌లను ఎన్ను కుని నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పొట్ట మ ధుకర్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు కాసిపేట సతీష్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పాపిరెడ్డి, సంపత్‌, స్వామి, వేముల రవిగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 10:35 PM