గ్రామాల అభివృద్ధికి ప్రణాళికతో కృషి చేయాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:48 PM
గ్రామపంచాయతీల స మగ్ర అభివృద్ధికి సర్పంచులు స్థానిక అవసరాలను గుర్తించి కార్యాచ ర ణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
కలెక్టర్ కుమార్ దీపక్
రామకృష్ణాపూర్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయతీల స మగ్ర అభివృద్ధికి సర్పంచులు స్థానిక అవసరాలను గుర్తించి కార్యాచ ర ణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం క్యాతనపల్లిలోని అమ్మ గార్డెన్స్‌లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలె క్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం లో సర్పంచులు, వార్డు సభ్యుల భాగస్వామ్యం అత్యంత కీలకమని తె లిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అందుబాటులో ఉన్న వన రులతో పరిష్కరించే విధంగా నిబందనల ప్రకారం చర్యలు తీసుకోవా లన్నారు. పంచాయతీలకు లభించే 15,16వ ఆర్ధిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తదితర వనరులను సమర్ధవంతంగా వినియోగించి గ్రామా భివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గ్రామాల్లో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జంతు పునరుత్పత్తి నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ, వీబీజీ రామ్‌జీ పథకాల కింద చేపట్టిన పనులకు చెల్లింపులు నిర్ణీత గడువులో జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీ భవనం, మహిళ సంఘాల భవనాలు, ఇతర ప్రా ధాన్యత కలిగిన మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన భూమి, ప రిపాలన అనుమతులు జిల్లా యంత్రాంగం నుంచి అందజేస్తామని తె లిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచులు చొరవ తీసుకుని గ్రామా ల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అ దనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్‌డీవో కిషన్, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జెడ్పీసీఈవో గణపతి పాల్గొన్నారు.