Share News

kumaram bheem asifabad- ఆదివాసీల అభ్యున్నతికి కృషి

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:42 PM

ఆదివాసీల అభ్యున్నతికి దివంగత మాజీ మంత్రి కొట్నాక భీంరావు కృషి చేశారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్‌పార్క్‌లో కొట్నాక భీంరావు వర్ధంతి సందర్భంగా శనివారం ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

kumaram bheem asifabad- ఆదివాసీల అభ్యున్నతికి కృషి
: కొట్నాక భీంరావు విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్‌, అధికారులు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల అభ్యున్నతికి దివంగత మాజీ మంత్రి కొట్నాక భీంరావు కృషి చేశారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్‌పార్క్‌లో కొట్నాక భీంరావు వర్ధంతి సందర్భంగా శనివారం ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భీంరావు విగ్రహానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ అనిల్‌ తదితరులు పూలమాలలు ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొట్నాక భీంరావు ఆదివాసీల హక్కులు, సంక్షేమం అభివృద్ధికి కొట్నాక భీంరావు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆకాష్‌, అహ్మద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆలీబీన్‌ అహ్మద్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అబ్దుల్లా, కౌన్సిలర్లు చిలువేరి వెంకన్న, సాలం, కార్తీక్‌, ఆదివాసి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు మర్సుకోల సరస్వతి, కోవ సాయినాథ్‌, అరుణ, అర్జు మాస్టార్‌, మడావి శ్రీనివాస్‌, బుర్స పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గాంధీచౌక్‌లోగల కోట్నాక భీంరావు విగ్రహానికి పలువురు నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు,మాజీ ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మరావు మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతి కోసం కోట్నాక భీంరావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆదివాసీ సమాజంలో విద్య, సాయాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కరం కోసం ఆయన నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలపు కొనసాగిస్తూ ఆదివాసీల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆత్రం ఓంప్రకాష్‌, మాజీ సర్పంచ్‌ ఆర్క నాగోరావుకోవ నాందేవ్‌, సార్మెడిలు ఆత్రం ఆనంద్‌రావు, మక్తుర్‌షా, కోయపూనేం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం ఆనంద్‌రావు, కనక నాగోరావు,యశ్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Aug 29 , 2026 | 11:42 PM