గ్రామాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:29 PM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
- నల్లమలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన
- ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- మద్దిమడుగులో అంజన్న దర్శనం
అమ్రాబాద్, పదర/ మన్ననూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన అచ్చంపేట నియోజకవ ర్గంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణతో కలిసి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదట అ మ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఇటీవల అస్వస్థతకు గురైన గురుకుల పాఠశాల పిల్లలను పలకరించి, అక్కడి పరిస్థితులను వారు పరిశీలించారు. ఇదిలా ఉండగా పెద్దపులు ల సంరక్షణ పేరుతో అనాదిగా శ్రీశైలం హైదరా బాద్ ప్రధాన రహదారిపై నివసిస్తున్న వటవర్ల పల్లి గ్రామాన్ని పునరావాస ప్యాకేజీ నుంచి అట వీ అధికారులు తొలగించేలా చర్యలు తీసుకోవా లని గ్రామస్థులు, రైతులు మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్, ఎమ్మెల్యే వంశీకృష్ణలను కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వెంకటపతి, మాజీ సర్పం చు చత్రూనాయక్, పార్టీల నాయకులు సూర్య నాయక్, ప్రభాకర్, అనిల్ కుమార్, రమేష్, రాజేందర్ పాల్గొ న్నారు. అనంతరం మండ ల కేంద్రమైన అమ్రాబాద్ కు చేరుకొని, వ్యవసాయ సబ్ మార్కెట్ యా ర్డులో కోటి రూపాయలతో నిర్మించిన ప్రహరీ, సీసీ రోడ్డును వారు ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో వారు పాల్గొని మొక్కలు నాటారు. అక్కడి నుంచి పదరకు వెళ్లారు. మం డలంలోని ఉడిమిళ్ల గ్రామంలో పలు అభివృదిఽ్ధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆశ్రమ పాఠశాల భవనం నిర్మాణానికి రూ.90లక్షలు, పదర మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనానికి రూ.10 లక్షలు, రైతులు ఆహారధాన్యం కొనుగోలు కేంద్రం గోదాం నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూ రయ్యాయి. ఆయా పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం మద్ది మడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించి శాలువాతో ఘనం గా సత్కరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాం తులు, ఆయు రారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. సేవాలాల్ విగ్రహ పనులను పరిశీ లించారు. రాష్ట్రంలో విద్యారంగంపై సీఎం రేవం త్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ దేవసహా యం, సీఈవో గోపాల్‌నాయక్, ఆర్డీవో యాదగిరి, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి వి.నరేందర్ రెడ్డి, ఏపీడీ శ్రీనివాసులు, అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రజితమల్లేష్, వైస్ చైర్మన్ ఆర్. వెంకటయ్య ముదిరాజ్, మండల కాంగ్రెస్ అ ధ్యక్షుడు ఎంఏ రహీం, అమ్రాబాద్ సర్పంచ్ కో టయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో రామన్న, మార్కెట్ కార్యదర్శి నరసింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పదర మండల అధ్య క్షుడు మాణిక్యం, జిల్లా ప్రఽధాన కార్యదర్శి రామ లింగయ్యయాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద్, మాజీ జడ్పీటీసీ రాంబాబునాయక్, సర్పంచ్‌లు ఎల్లమ్మ, శ్రీనివాసులు, కృష్ణవేణి పాల్గొన్నారు.