kumaram bheem asifabad- విద్యారంగ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Nov 11 , 2026 | 10:35 PM
దేశంలో విద్యారంగ అభివృద్ధికి అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి చిరస్మరణీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆసిఫాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో విద్యారంగ అభివృద్ధికి అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి చిరస్మరణీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్య్రం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. మహనీయుల ఆశయాలను నేటితరం యువత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో వేణు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అకాష్, ఆహ్మద్, పీఏసీఎస్ చైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, ఇన్‌చార్జీ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, కౌన్సిలర్లు బాలకృష్ణ, సాలం, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, డీసీసీ ఉపాఽధ్యక్షులు తారీక్, భీంరావు, మైనార్టీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్వి కలీం, పార్టీ మండల అధ్యక్షుడు మురళీ, టౌన్ అధ్యక్షుడు ఇమ్రాన్, మాజీ ఎంపీటీసీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): అబుల్ కలాం ఆజాద్ జీవితం యువతకు స్ఫూర్తిదాయక మని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు సెల్వట్‌కార్ పెంటు అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం హంసరాజ్, కమలేష్ బంటి, జాబిరే గణేశ్, శివాజీ, మారుతి, గుండయ్య, ప్రభాకర్, ధర్ము, అజీమొద్దీన్ పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాట ఆయన చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుజాయిత్ ఖాన్ పూలమాలలు వేసి నివాలులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల వైస్ ప్రసిడెంట్ జగన్నాథ్‌రావు, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శులు షేక్ మహ్మద్, షేక్ ఫరూక్, మండల కార్యదర్శులు పిట్టగిడ్డప్ప, మడావి రాజు, సిడాం తిరుపతి, రాథోడ్ దేవిదాస్, నగేష్, దత్తు, ఆయూబ్ ఖాన్, విశేష్‌రావు పాల్గొన్నారు.