కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:12 PM
కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు శక్తివంచనలేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కోరారు.
- ఎమ్మెల్యే నారాయణరెడ్డి
కల్వకుర్తి/ వెల్దండ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు శక్తివంచనలేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శుక్రవారం మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల నియమితులైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముడావత్ హరికిషన్‌నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీలాల్‌నాయక్, జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్‌లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో వచ్చిన పదవులను బాధ్యతగా నిర్వర్తించి, ప్రజాభిమానం చూరగొనాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, నాయకులు పర్వత్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్, పుల్లయ్య, రామచంద్రారెడ్డి, శ్రీనుయాదవ్, శేఖర్‌రెడ్డి, అన్వర్‌పాషా, గున్నెళ్ల శ్రీను, శ్రీనునాయక్, రమేష్‌నాయక్, లచ్చిరాంనాయక్, రాజుయాదవ్, కేశమళ్ల కృష్ణ, ఎర్రశ్రీను, భరత్‌గౌడ్, అరుణ్‌నాయక్, రమేష్, రాందాసు, తారాసింగ్, బద్రు ఉన్నారు.
కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 30మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కు లు, 40మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను, అంగ న్‌వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పంపిణీ చేశారు. కార్య క్రమంలో పీసీబీ సభ్యులు బాలాజీసింగ్, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, కల్వకుర్తి సీడీ పీవో భాగ్యమ్మ, తహసీల్దార్ ఇబ్రహీం, మాజీ వైస్ చైర్మన్ ఎంపీపీ బొమ్ము ఆంజనేయులు, కాంగ్రె స్ పార్టీ జిల్లా అధికారప్రతినిధి చిమ్ముల శ్రీకాం త్‌రెడ్డి, కల్వకుర్తి మండల అధ్యక్షులు బాల్‌రెడ్డి, కల్వకుర్తి పట్టణ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.
ఆసుపత్రుల కోసం మంత్రికి వినతి
నియోజకవర్గంలోని వెల్దండ, కడ్తాల్, తలకొం డపల్లి మండలాలకు 50 పడకల ఆసుపత్రు లను మంజూరు చేయాలని రాష్ట్ర వైద్యారో గ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు ఎ మ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి వినతిపత్రం అందజేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రాజనరసింహ సాయంత్రం కల్వకుర్తిలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు.