ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:36 PM
రాష్ట్రంలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు, భూగర్భశాఖ మంత్రి వివేక్‌వెం కటస్వామి పే ర్కొన్నారు. సోమవారం చెన్నూరు
మంత్రి వివేక్‌వెంకటస్వామి
చెన్నూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు, భూగర్భశాఖ మంత్రి వివేక్‌వెం కటస్వామి పే ర్కొన్నారు. సోమవారం చెన్నూరు మండల కేంద్రంలో అడ్వా న్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర పార్యటక, సాంస్కృ తిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి భూమి పూజ చేశారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడు తూ చెన్నూరు పట్టణంలో రూ.47.11 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను మంజూరు చేసి నిర్మాణానికి భూమి పూజ చేశా మన్నారు. నియోజకవర్గంలో 40 కోట్లతో అంతర్గత రహదా రు లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టామని, సమస్యల ప రిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. విద్యారంగా న్ని బలోపేతం చేసేందుకు సోమనపల్లి ప్రాంతంలో ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసి నిర్మాణం చే పడుతున్నామన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్‌ను విస్తరిస్తూ మ రొక ప్లాంట్ నిర్మాణం చేపట్టామని, తద్వారా ఈ ప్రాంత నిరు ద్యోగ యువతకు ఉద్యోగావకా శాలు లభిస్తాయన్నారు. చెన్నూ రులోని మహిళ సంఘాలకు పెట్రోల్ బంక్ మంజూరు చేశా మన్నారు. ఈ ప్రాంతంలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ మన ఇసుక వాహనం ద్వారా తక్కువ ధరకు వినియోగారులకు ఇసుకను పంపిణీ చేస్తున్నా మన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమంలో భాగంగా రూ. 20 వేల కోట్ల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. క లెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెం టర్ ద్వారా సమీప ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు అధు నాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ అందించి స్వయం ఉపాధి పొందేలా తర్ఫీదు ఇస్తామన్నారు. అనంతరం చెన్నూరు పరిధి లోని 214 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 76,65,430 చెక్కులను అందజేశారు. చెన్నూరు పట్టణంలోని 16వ వార్డులో ముదిరాజ్ భవన నిర్మాణానికి, 8వ వార్డులో బైపాస్‌రోడ్డు నిర్మాణానికి, 9వ వార్డు సీసీ రోడ్ల నిర్మాణానికి, 15 వవార్డులో నూతన ఆస్పిరేషన్ టాయిలెట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్ర తినిదులు, నాయకులు పాల్గొన్నారు.