ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచాలి
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:22 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచి, మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు.
- డీఈవో రమేశ్ కుమార్
వెల్దండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచి, మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని కొట్ర పాథమిక పాఠశాలను రమేశ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని మౌళిక వసతులు, విద్యార్థుల హాజరు, రికార్డును పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠ్యాంశాలపై వారికున్న అవగాహనను తెలుసుకున్నారు. విద్యాప్రమాణాలలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా బోధించాలని డీఈవో సూచించారు.