విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి : డీఈవో
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:24 PM
ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థు లకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి రమేశ్ కుమార్ అన్నారు.
కొల్లాపూర్, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థు లకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి రమేశ్ కుమార్ అన్నారు. శని వారం ఆయన కొల్లాపూర్ మండలం బోడబం డ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల ను పరిశీలించారు. ఈ పాఠశాలలో విద్యార్థు ల సంఖ్య పెరిగినందున మరో ఉపాధ్యాయు డిని నియమించాలని మాజీ జడ్పీటీసీ హను మంత్ నాయక్, గ్రామస్థులు డీఈవోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రజావాణి ఫిర్యాదు మేరకు ఎల్లూరులోని అక్షర ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేసి, హాజరు రిజిస్టర్లు, ఉ పాధ్యాయుల అర్హతలు, మరుగుదొడ్లు, తాగు నీటిని పరిశీలించారు. పూర్తి నివేదికను అంద జేయాలని ఎంఈవోను డీఈవో ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా టెక్ట్స్ బుక్ మేనేజర్ నర సింహ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ స్వామి, ఉపా ధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.