kumaram bheem asifabad- విద్యా ప్రమాణాలు మెరుగు పడాలి
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:16 PM
జిల్లాలో పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికారులు ప్రధానోపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బుధవారం ఎంఈవోలు, హెచ్‌ఎంలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో విద్యరంగానికి సంబంధించిన నాణ్యత, సమానత్వం, జవాబుదారీతనం తదితర ఆంశాలలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికారులు ప్రధానోపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బుధవారం ఎంఈవోలు, హెచ్‌ఎంలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో విద్యరంగానికి సంబంధించిన నాణ్యత, సమానత్వం, జవాబుదారీతనం తదితర ఆంశాలలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని విద్యార్థుల అభ్యసన ఫలితాలను పెంపొందించాలని తెలిపారు. ప్రతీ విద్యార్థికి అపార్ ఐడీ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఉపాధ్యాయులు విద్యార్థుల ముఖ గుర్తింపు వ్యవస్థ హాజరును క్రమం తప్పకుండాసక్రమంగా వినియోగించేలా ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు బాధ్యతతో పని చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో సచ్చిదానందచారి తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం ఇందిరనగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం కలెక్టర్ హరిత తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అధ్యాపకుల హాజరు పట్టిక, తరగతి గదుల, విద్యా బోధన తీరు, పరిసరాలను పరిశలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియేట్ విద్యార్థుల సిలబస్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. విద్యార్థులు వంద శాతం కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు కంప్యూటరఫై అవగాహన కలిగే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వల గది, రోగుల చికిత్స పొందుతున్న గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కార్యక్రమంల కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.