Share News

kumaram bheem asifabad- విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:52 PM

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపులో ప్రధానోపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని డీఈవో సచ్చిదానందచారి అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలికల పాఠశాలలో బుధవారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు

kumaram bheem asifabad- విద్యా ప్రమాణాలు పెంపొందించాలి
మాట్లాడుతున్న డీఈవో సచ్చిదానందచారి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపులో ప్రధానోపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని డీఈవో సచ్చిదానందచారి అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలికల పాఠశాలలో బుధవారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రదానోపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన పురోగతిని నిరంతరం పరిశీలించాలన్నారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి తగిన విద్యా ప్రణాళికలు రుపొందించి పాఠశాలలను ఉత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ విద్య కార్యక్రమాలు తదితర అంశాలపై నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. మూడు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకొని నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యశాఖ అధికారులు శ్రీనివాస్‌, జనార్థన్‌, హనుమంతు, ప్రబోద్‌, నటరాజ్‌, అమరెందర్‌రెడ్డి, అయా పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 10:52 PM