Share News

kumaram bheem asifabad- ఆకలి చదువులు

ABN , Publish Date - Jul 11 , 2026 | 10:43 PM

జిల్లాలో ఇంటర్‌ విద్యార్థులకు ఇంకా మఽధ్మాహ్న భోజనం పథకం అమలు కాక పోవడంతో ఆకలితోనే చదువు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిం చడంతో పాటు పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది

kumaram bheem asifabad- ఆకలి చదువులు
లోగో


- హామీలకే పరిమితమైన ప్రభుత్వ ప్రకటన

- దూరప్రాంత విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

- జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు

బెజ్జూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్‌ విద్యార్థులకు ఇంకా మఽధ్మాహ్న భోజనం పథకం అమలు కాక పోవడంతో ఆకలితోనే చదువు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిం చడంతో పాటు పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని పలుమార్లు హామీ సైతం ఇచ్చింది. అయితే ఆ హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో వే లాది మంది పేద విద్యార్థులు ఇబ్బందులు పడు తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ల్లో చదువుఉతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. ఉదయం ఇంటి నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం వరకు కళాశాలల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న సమయంలో భోజ నం కోసం బయట హోటళ్లకు వెళ్లాలంటే ఖర్చు భరించలేక చాలా మంది విద్యార్థులు ఆకలితోనే తరగతులకు హాజరవుతున్నారు. ప్రభుత్వం ప్రభు త్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

- ఉన్నత విద్య కోసం..

పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్‌ చదు వుకోవాలని ముందుకు వస్తున్న విద్యార్థులు ఏళ్లుగా ఆకలితో అలమటిస్తూ చదువులను కొనసాగించే పరిస్థితి ఏర్పడుతోంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 11ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుండగా, ఇందులో ద్వితీయ సంవత్సరంలో 2,348మంది విద్యార్థులు, ప్రథమ సంవత్సరంలో 2,200లకు పైగా(ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయి) విద్యా ర్థులు ఉన్నారు. సుమారు 15నుంచి 20కిలోమీటర్ల దూరం నుంచి నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తు న్నారు. అప్పటి సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నియోజకవర్గంలోని కళాశాలల్లో మధ్యాహ్న భోజనా న్ని పెడుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్న గత ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రకటించినా..అమలు కాలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం జూనియర్‌ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి మధ్యా హ్న భోజనం అమలు చేస్తామని హామీలు ఇచ్చినా ఇంకా అమలుకు శ్రీకారం చుట్టలేదు. ఆకలితో తరగతుల్లో కూర్చోవడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతోంది. కొందరు మధ్యాహ్నం తర్వాత తరగతులకు హాజరుకాక ఇంటికి వెళ్లిపోతుండగా, మరికొందరు అప్పుడప్పుడు కళాశాలకు రావడానికే వెనుకాడుతున్నారు. దీని ప్రభావం విధ్యా ఫలితాల పై కూడా పడుతోందని ఆయా కళాశాలల అఽధ్యాప కులు చెబుతున్నారు.

- హామీ అమలుకు..

ఈ పథకం అమలైతే పేద విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు కళాశాలల్లో హాజరు శా తం, విద్యా నాణ్యత కూడా మెరుగుపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాఠ శాలల్లో విజయవంతంగా కొనసాగుతున్న మధ్యా హ్న భోజన పథకం తరహాలోనే కళాశాల విద్యార్థు లకు కూడా భోజనం అందించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హామీ లకే పరిమితం కాకుండా పథకాన్ని ఆచరణలోకి తీసుకరావాలని విద్యార్థులు, ఆయా సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

భోజనం చేయకుండానే వస్తున్నాం..

- సంజయ్‌, ద్వితీయ సంవత్సరం విద్యార్థి

దూరం నుంచి రావడం వల్ల ఉదయం భోజనం చేయకుండానే వస్తున్నాం. మధ్యాహ్న భోజనం అమలుతో ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. నేను పాపన్‌పేట నుంచి వచ్చి బెజ్జూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదు వుతున్నాను. కళాశాల త్వరగా ప్రారంభం కావడం, బస్సులు త్వరగా రాకపోవడంతో కొన్ని సందర్బాల్లో భోజనం చేయకుండానే రావాల్సిన పరిస్థితి ఏర్పడు తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

త్వరగా అమలు చేయాలి..

- ఎన్‌. కార్తీక్‌, మొదటి సంవత్సరం విద్యార్థి

ప్రభుత్వం కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రకటించిన హామీని తక్షణమే అమలు చేయాలి. భోజనం లేక అర్దాకలితో అలమ టిస్తూ ఏకాగ్రతను కోల్పోతున్నాం. ఆకలి కారణంగా అధ్యాపకులు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదు. ప్రభుత్వం త్వరగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి.

ఇంకా ఆదేశాలు రాలేదు..

- రాందాస్‌, ఇంటర్‌ నోడల్‌ అధికారి

జిల్ల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. రాష్ట్రంలో ఫైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కళాశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం అమలు జరుగుతోంది. జిల్లాలో రెండో విడతలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. మధ్యా హ్న భోజనం అమలుతో కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు ఉత్తమ ఫలి తాలు సాధించే అవకాశం ఉంటుంది.

Updated Date - Jul 11 , 2026 | 10:43 PM