kumaram bheem asifabad- అర్ధాకలి చదువులు
ABN , Publish Date - Oct 27 , 2026 | 10:16 PM
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామన్న ప్రభుత్వ హమీ ప్రకటనలకే పరిమితమైంది. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం పస్తులు ఉంటూ అర్ధాకలితో చదవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి
- పథకం అమలు ప్రకటనలకే పరిమితం
- జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
- ఎదురుచూపుల్లో మూడువేల మంది విద్యార్థులు
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామన్న ప్రభుత్వ హమీ ప్రకటనలకే పరిమితమైంది. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం పస్తులు ఉంటూ అర్ధాకలితో చదవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయాన్నే కళాశాలకు బయలుదేరే విద్యార్థులు మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతోనే తరగతి గదుల్లో గడపాల్సి వస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అకలితో చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నా ఎవరు పట్టించుకోవడంలేదనే విమర్శ లు వినిపిస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం లోనే పథకం అములుపై ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం నేటికి అమలు కాలేదు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా సుమారు మూడువేల మంది విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుం ది. ఉదయాన్నే రావడంతో చాలామంది ఇంటివద్ద అల్పాహరం తీసుకోకుండానే కళాశాలలకు వస్తున్నా రు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లె అవకాశం లేకపోవడంతో సాయంత్రం వరకు అకలితోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మరికొందరు భోజనం కోసం ఇంటికి వెళ్లి తిరిగి కళాశాలకు రాకపోవడంతో హజరు తగ్గుతోంది. కళాశాలకు వచ్చే పేద విద్యార్థులకు భోజనం కొనుక్కునే స్థోమత లేకపోవడంతో పస్తులుంటున్నారు. కాగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో తర గతుల్లో కూర్చోవడం విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది. అకలి, నీరసం, అలసటతో పాఠాలపై దృష్టి సారించలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రయాణం చేసి వచ్చే విద్యార్థులకు అల్పాహరం, మధ్యాహ్న భోజనం అందితే హజరు పెరగనుందని విద్యావేత్తలు అంటున్నారు.
- పాఠశాలల తరహాలో..
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న తరహాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోను అల్పాహరం, మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రభుత్వం ప్రక టించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రవేశాల ప్రచార సమయంలోను ఈ పథకం గురించి వివరించడంతో విద్యార్థుల్లో ఆ శలు చిగురించాయి. అయితే పథకం అమలుకు సం బంధించి స్పష్టమైన మార్గదర్శకాలు, నిధుల కేటా యింపు, ఆహార సరఫరా విధానంపై స్పష్టత లేకపో వడంతో అచరణలోకి రావడంలేదు. ప్రభుత్వం స్పం దించి మధ్యాహ్న భోజన పథకం అమలుకు మార్గ దర్శకాలను విడుదల చేసి నిధులు కేటాయించి కళాశాలల వారీగా భోజన సరఫరా ఏర్పాట్లు చేప ట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.