ఉద్యోగం వచ్చే వరకు ఉపాధి పనులకు వెళ్లండి
ABN , Publish Date - May 16 , 2026 | 04:47 AM
చదువుకున్న వారు కూడా ఉద్యోగం వచ్చే వరకు ఉపాధి పనులు చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందవచ్చని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ చెప్పారు.
చదువుకున్న వారు కూడా లబ్ధి పొందండి
గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి దాన కిషోర్
కోహీర్, మే 15(ఆంధ్రజ్యోతి): చదువుకున్న వారు కూడా ఉద్యోగం వచ్చే వరకు ఉపాధి పనులు చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందవచ్చని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సజ్జాపూర్‌లో ఆయన ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలను పలకరించారు. రాష్ట్రంలో గతంలో రోజుకు 17 లక్షల మంది ఉపాధి పని చేసేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 12 లక్షలకు పడిపోయిందని గుర్తు చేశారు. కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఫొటో క్యాప్చర్ విధానంతో ఇబ్బందులు పడుతున్నామని కూలీలు దాన కిషోర్‌కు ఫిర్యాదు చేశారు.