సృష్టి సరోగసి కేసులో డా.నమ్రత ఆస్తుల జప్తు
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:40 AM
సృష్టి సరోగసి కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రతకు చెందిన రూ.29.76 కోట్ల విలువైన 50 స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసింది.
రూ.29.76 కోట్ల స్థిర, చరాస్తులను సీజ్ చేసిన ఈడీ
హైదరాబాద్,మార్చి10(ఆంధ్రజ్యోతి): సృష్టి సరోగసి కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రతకు చెందిన రూ.29.76 కోట్ల విలువైన 50 స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు, ఆస్పత్రి భవనాన్ని జప్తు చేసినట్లు ఈడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రి భవనం ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50 కోట్లు ఉండొచ్చని పేర్కొన్నారు. 2014 నుంచి ఫెర్టిలిటీ సెంటర్ల పేరిట అక్రమ సరోగసి రాకెట్ నిర్వహిస్తున్న నమ్రత ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను నియమించుకుని దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్ ఏర్పాటు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో విచారణకు సహకరించని నేపఽథ్యంలో నమ్రతను గత నెలలో ఈడీ అధికారులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.