శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా స్క్రీనింగ్
ABN , Publish Date - May 22 , 2026 | 04:47 AM
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఎబోలా థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
శంషాబాద్ రూరల్, మే 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఎబోలా థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే శంషాబాద్‌లో విమానాశ్రయ ఆరోగ్య సంస్థ (ఏపీహెచ్‌వో) అధికారులు ఈ పరీక్షలను ప్రారంభించారు. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు విధిగా నిర్వహిస్తున్నారు. జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, కారణం లేని రక్తస్రావం వంటి లక్షణాలు కలిగిన ప్రయాణికులను ముందుగానే గుర్తిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తుల నుంచి అంగీకార పత్రం తీసుకుని క్వారంటైన్‌తో పాటు చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రులకు తరలిస్తామని చెప్పారు.