శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా కలకలం!
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:24 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విదేశీ ప్రయాణికుడిలో ఎబోలా వైరస్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. గురువారం ...
శంషాబాద్ రూరల్/అడ్డగుట్ట, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విదేశీ ప్రయాణికుడిలో ఎబోలా వైరస్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. గురువారం శంషాబాద్‌కు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సూడాన్‌కు చెందిన మహ్మద్ (45)కు పరీక్షలు చేయగా.. అతడిలో ఎబోలా వైరస్ అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈనేపథ్యంలోనే గాంధీలోని ఎబోలా ఐసోలేషన్ వార్డులో అతడిని ఉంచి.. రక్త నమూనాలు, ఇతర శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీ, పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. సదరు ప్రయాణికుడికి తీవ్రంగా జ్వరం ఉండడంతోనే ఇక్కడకు పంపించారని గాంధీ జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ సునిల్ కుమార్ తెలిపారు. ఇప్పుడు జ్వరం కూడా తగ్గిందని.. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.