Vallapureddy Ravinder Reddy: ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయండి..
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:04 AM
తెలంగాణలో ఈబీసీ కమిషన్‌ను, ఈబీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డిని ఈబీసీ సంక్షేమ సంఘం...
సీఎంను కోరిన ఈబీసీ సంక్షేమ సంఘం
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఈబీసీ కమిషన్‌ను, ఈబీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డిని ఈబీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి చేపడుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను అగ్రవర్ణ పేద కుటుంబాలకు వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈబీసీ విద్యార్థులకు స్టడీ సర్కిళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నారు.