అన్ని రాష్ట్రాల్లో ఈబీసీ కమిషన్లు వేయాలి
ABN , Publish Date - May 16 , 2026 | 04:19 AM
అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం కేంద్రంలో, అన్ని రాష్ట్రాల్లో ఈబీసీ కమిషన్లు, కార్పొరేషన్లు, సంక్షేమ విభాగాలను ఏర్పాటు చేయాలని ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి కోరారు.
రాంచందర్‌రావును కలిసిన ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపరెడ్డి
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం కేంద్రంలో, అన్ని రాష్ట్రాల్లో ఈబీసీ కమిషన్లు, కార్పొరేషన్లు, సంక్షేమ విభాగాలను ఏర్పాటు చేయాలని ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును కలిసిన ఆయన.. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తున్న అన్ని ప్రయోజనాలను అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి రాంచంద్రరావు కూడా సానుకూలంగా స్పందించి, అగ్రవర్ణ పేదలను ఆదుకునేలా ప్రధానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చినట్లు వల్లపరెడ్డిప్రకటనలో తెలిపారు.
సోషల్ మీడియాలో ఆర్టీసీ సమస్త సమాచారం
ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సోషల్ మీడియా సేవల్ని విస్తరించింది. ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌లోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ ప్రయాణికులకు సమాచారం అందిస్తుంది. టికెట్ బుక్ చేసుకున్న బస్సు సర్వీస్ వివరాలతోపాటు ఎప్పటికప్పుడు వేర్వేరు మార్గాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో అందించే టిక్కెట్ ధర రాయితీలను సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులకు తెలియజేస్తుంది.