kumaram bheem asifabad-సులువుగా.. సులభంగా..
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:16 PM
సర్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులువుగా.. సులభంగా చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలు ఇంటింటా సిబ్బంది అందజేశారు. ఎన్యూమరేషన్ వివరాలు 2002 ఓటరు జాబితాతో వివరాలు సేకరించి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్‌వో వద్ద సమర్పించాల్సి ఉంటుంది.
- కొత్త ఆప్షన్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
- ఓటర్లకు తీరనున్న కష్టాలు
రెబ్బెన, జూలై 16 (ఆంధ్రజ్యోతి): సర్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులువుగా.. సులభంగా చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలు ఇంటింటా సిబ్బంది అందజేశారు. ఎన్యూమరేషన్ వివరాలు 2002 ఓటరు జాబితాతో వివరాలు సేకరించి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్‌వో వద్ద సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో గంట కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ ప్రక్రియకు కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- అఽధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి..
ఇందుకు ఓటరు తొలుత భారత ఎన్నికల సంఘం అఽధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ ఓటరు ఐడీ నంబర్, రిజిస్ట్రర్ సెల్‌నంబరు నమోదు చేయాలి. వెంటనే ఓటీపీ వస్తోంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కాగానే ఆన్‌లైన్‌లో ఫుల్ ఎన్‌రోల్‌మెంటు ఫారం ఎంచుకొని ఆ తర్వాత వెబ్‌పేజీలోకి మీ పాత రికార్డులకు సంబంఽధించిన వివరాలు కన్పిస్తాయి. అవి సరి పోల్చుకుంటూ అడిగిన అవసరమైన తాజా సమాచారాన్ని నమోదు చేయాలి. వివరాలు సరిగ్గా పూర్తి చేశాక సిస్టం ఈ సైన్ పేజికి రీ డైరెక్టర్ చేస్తోంది. అక్కడి మీ ఆధార్ నంబరు ఆధారంగావచ్చే ఓటీపీ ద్వారా మీ ఫారం విజయవంతంగా అప్‌లోడ్ అయినట్టు ఎస్‌ఎంఎస్ వస్తోంది. ఈ ఆప్షన్లు ప్రధానంగా ఓటరు జాబితా, ఆధార్ కార్డులోని పేరు సరి పోలిన ఓటర్లు ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఓటర్లు తమ ఓటరు ఐడీ కార్డుతో సెల్ నంబర్లు అనుసంధానం కాక పోతే మొదటగా అదే పోర్టల్‌లో ఫారం-8 పూర్తి చేసి అనుసంధానం చేసుకోవల్సి ఉంటుంది. ఈ విషయమై తహసీల్దార్ సూర్య ప్రకాష్‌ను వివరణ కోరగా, బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారం అందిస్తున్నారని చెప్పారు. ఓటరు ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని వివరించారు. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో కూడా సులభంగా చేసుకోవచ్చునని తెలిపారు.